మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభ కాలం నుండి, ఇప్పటివరకూ, అంటే ఈ నూరు సంవత్సరాలలో ప్రచురించబడ్డ ‘చారిత్రక నవలల’కు లూకాచ్ చెప్పిన లక్షణాలు ఉన్నాయా, లేవా? అనే ప్రశ్నకి సమాధానం వేరే మరొక వ్యాసం మరొకరు రాయవలసి ఉంటుంది. అసలు, లూకాచ్ ఉద్ఘాటించిన లక్షణాలు ఈ కాలపు చారిత్రక నవలలకి ఆపాదించవచ్చా అన్నది మౌలిక మైన ప్రశ్న.

నిశ్శబ్దంగా లంగరెత్తి అంధకారపు కడలి కడుపు లోకి
మాయమయ్యే ఒంటరి నావలా నీవు వెళ్ళిపోయే క్షణాన
నీ అంతరంగంలో చెలరేగిన వేదనల తుఫానుల్ని …

ఇంకొక విశేషమేమిటంటే – ఈ కవితలు వ్రాసిన కవులు ఒకరు ఆంధ్రలో, మరొకరు అమెరికాలో ఉన్నా, ఇద్దరూ కూడబలుక్కుని వ్రాసినట్లనిపించాయి. ఒకరు ‘చందవరం, ప్రకాశం జిల్లా’లో మనల్ని ఒక రౌండ్ కొట్టిస్తే, మరొకరు అధునాతనమైన బంగళాలోకి ‘తేనీటి సమయానికి’ సాదరంగా ఆహ్వానించారు.

నిద్ర లేచిన భీముడు ‘ఎవరూ’ అని అడిగి, ద్రౌపది గొంతు గుర్తించి – కీచకుని దురాగతం నాకు చెప్పి వాణ్ణి చంపేందుకు నన్ను నియోగించడానికి వచ్చింది కాబోలు అనుకుంటూ, అయినా తన నోటితోనే విందామని నిశ్చయించుకొని – ‘ఇంత రాత్రివేళ ఎందుకొచ్చావు, ఎవరూ చూళ్ళేదు గదా’ అంటాడు. ఆమె ఆ మాత్రం అర్థం చేసుకోలేదా?

అన్నీ తెలిసిన ఆ భగవంతుడికి అంతా మాయే. అంతా లీలే. కాని ఆ తల్లికి మాత్రం తన బిడ్డడు నవ్వే ప్రతి నవ్వు, వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి చేష్టా ఒక అద్భుతము, అపూర్వము అయిన అనుభూతి. దాన్ని కాదనడానికి, త్రోసిపుచ్చడానికి సాధ్యాసాధ్యాలు అంటూ లేని ఆ దేవదేవుడికి కూడా సాధ్యం కాలేదు.

ఎవరబ్బా ఈ మీనాక్షి? ఆమెకి నా ముఖం ఉంది. నా రూపం ఉంది. కాని వట్టి ఆమె కాదు నేను. రాబోయే కాలంలో నా పేరు మారు మ్రోగబోతుంది. చిన్నప్పటి నుంచీ అదే నా కల. అదే నా లక్ష్యం. ఎంతో మంది మీనాక్షిలలో నేను కూడా ఒక మీనాక్షినా? కానే కాదు. నేను వాణిని. చదువుల తల్లిని. పూలమాలతో దేవేరుని అలంకరించిన ఆండాళ్ నేనే.

“ఆ కళ్ళు ఇంతకు ముందు నిన్ను ఇలా నిలదీసి చూడలేదు. నిన్ను చూసి చూపు తిప్పుకునే కళ్ళు నిన్నిప్పుడు సూటిగా చూస్తున్నాయి. నువ్వూ మెల్లిగా మర్చిపోతున్నావు. ఆ కళ్ళు అప్పటి శత్రువులవి. వీళ్ళవి కాదు. ఇప్పుడు వీళ్ళూ అవే కళ్ళతో మనల్ని చూస్తున్నారు.

ఎందుకు రాస్తున్నావు? అంటే ఒక్క కనక ప్రసాదు కోసమే రాస్తున్నాను అని. మనం రోజూ అన్నం తినేటప్పుడు ఉన్నతమైన తెలుగు సస్యసీమల భవిష్యత్తు కోసమో, తెలుగు పిండివంటల భవిష్యత్తు ఏమవుతుందోనని బెంగపెట్టుకునో అన్నం తినము. మనకి ఆకలేస్తోంది కాబట్టి, తప్పనిసరై అన్నం – లేదూ ఏది దొరికితే అదీ తింటాము.

బాలవ్యాకరణం కన్నా ముందు వచ్చిన తెలుగు వ్యాకరణ గ్రంథాల గురించి చాలామందికి తెలియదు. పాణిని తనకన్నా ముందు వచ్చిన వ్యాకరణాల గురించి ప్రస్తావించినట్టుగా, చిన్నయ్యసూరి తనకంటే పూర్వం వెలువడిన వ్యాకరణాలను ప్రస్తావించలేదు. కానీ, తెలుగులో కూడా వ్యాకరణ గ్రంథాలు కవిత్రయ కాలం నుండీ వెలువడుతూ ఉన్నాయి.

నాకు బాగా జ్ఞాపకం ఉంది. చిన్నప్పుడు నాకెప్పుడు ఒంట్లో బాలేకపోయినా, అమ్మ ఇలాగే చేసేది. ఎన్నోసార్లు నా రోగాలు అమ్మ చేతి స్పర్శ తగలగానే మంత్రం వేసినట్లు మాయమయ్యేవి. అమ్మ అరచేతుల స్పర్శ స్నేహితంగా ఎంతో ఆనందంగా ఉండేది, గంగ, యమున నదుల నీళ్ళలా చల్లగా హాయిగా ఉండేది.

నాగమ్మ పని మానేయడానికి నన్ను కారణం చేస్తున్నందుకు నాకైతే భలే మండుకొచ్చింది. శాసన సభలోలా, ఈ సంసారంలో – ఈవిడ ఎప్పుడు ప్రతిపక్షమౌతుందో, ఎప్పుడు మిత్రపక్షం వహిస్తుందో తెలీదు. తను నాకు అత్తగారన్న సంగతి ఆర్నెల్లకో సారి ఇదిగో ఇలా గుర్తు చేస్తూ వుంటుంది. సుర్రుమంది మనసు. పీకల దాకా వచ్చిన కోపాన్ని నిభాయించుకోవాల్సి వచ్చింది.

“స్త్రీల విషయంలో మనుష్యులు ఆచరించని దోషం ఏదయినా వుందా? నిజం చెప్పండి.” అని వరాహమిహిరుడి శ్లోకం మకుటంగా ఈ కథ ప్రారంభమవుతుంది. కథా వస్తువు ముందుగానే తెలిసిపోతుంది. కథ అంతా చదివిన తరువాత, బహుశా ఆ వాక్యం ఆఖరిగా రాసి వుంటే బాగుండేదేమో ననిపించింది, నాలో ‘విమర్శకుడి’కి.

రామారావు లండన్‌కి కనీసం కుంచెలు కూడా తీసుకొని పోకుండా ఉట్టి చేతులతోనే వెళ్ళాడు. పాశ్చాత్య చిత్రకళారీతులను అక్కడి గురువుల నుండి మళ్ళీ కొత్తగా మొదటినుండీ నేర్చుకోడానికే నిర్ణయించుకోడమే ఇందుకు కారణం. అతని ప్రయత్నమంతా అక్కడ ఒక ఆధునిక చిత్రకారుడిగా ఎదగడమే.

పారసీక ఉర్దూ భాషలలో మత్తకోకిల లయను బహర్ రమల్ ముసమ్మన్ మహజూఫ్ అంటారు (బహర్ అంటే పద్యము లేక వృత్తము). దీని సూత్రము ఫాయలాతున ఫాయలాతున ఫాయలాతున ఫాయలున్. దీనిని మన గురులఘువులవలెనే వివరిస్తారు. గాలిబ్ వ్రాసిన సబ్ కహాఁ కుఛ్ లాలహ్ ఓ గుల్ మేఁ నుమాయా హో గయీ అనే గజల్‌ ఈ లయలోనిదే.

రామారావుగారి కధ మంచి ఫోటో గ్రాఫర్ తీసిన ఫోటోలా ఉంటుంది. కానీ మంచి చిత్రకారుడు గీసిన చిత్రంలా ఉండదు. రచయిత దృక్పధాన్ని కధను మధించి పట్టుకోవటానికి వీలుగా ఉండాలి. ఈ కధ ద్వారా రామారావుగారు ఇంతకూ చెప్పదలచుకున్నది ఏమిటంటే అదేదో చెప్పటం కష్టం. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండా కధ సాగుతుంది.

చారిత్రక నవలకుండవలసిన మొదటి లక్షణం చారిత్రకత. సాధారణంగా సాంఘిక నవలలన్నీ సమకాలిక సమాజాన్ని వాస్తవికంగానే చిత్రిస్తాయి. కానీ సామాజిక పరిస్థితులు యెంత వాస్తవికంగా, యెంత విపులంగా, యెంత కళాత్మకంగా చిత్రించినా, ఆ దేశకాల పరిస్థితులు అలా యెందుకున్నాయనే ప్రశ్న ఎప్పుడూ ఉత్పన్నంకాదు (ప్రశ్నే లేదు గనక సమాధానమూ లేదు).

చరిత్రాత్మక నవల అనేది రెండు విరుద్ధ శబ్దాల సమ్మేళనమనే భ్రాంతి కలిగిస్తుంది. జరిగినదంతా వ్రాసుకుంటూ పోతే చరిత్ర కాదు. లోకానికో, దేశానికో, సంఘానికో, వ్యక్తికో, మంచికో, చెడుకో ప్రభావం కలిగించే సంఘటనలు వ్రాస్తేనే చరిత్ర. దానితో అనుగుణమైన కల్పన జోడిస్తే చరిత్రాత్మక నవల అవుతుంది. దానికి చరిత్ర బీజముంటే చాలును.

ఒక ఉపాధ్యాయుడికి శిక్షణ ఇవ్వడానికి నాలుగేళ్ళు, ఔషధ నిర్మాతకి ఐదేళ్ళు, దంత వైద్యుడికి ఆరు, న్యాయవాదికి ఏడు, వైద్యుడికి ఎనిమిది సంవత్సరాలు శిక్షణ అవసరం అయినప్పుడు, అంతకు తక్కువ సమయం లోనే ఒక సుశిక్షితుడైన జీవిత నవలారచయితగా ఎదగడం ఎలా సాధ్యం?