సూర్యకుమారిగారు 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాదు వచ్చినప్పుడు ఆకాశవాణివారి కేంద్రంలో ఈ ఆది శంకరుని రచనగా భావించబడే “నిర్వాణ షట్కం” (లేక నిర్వాణ శతకం) రికార్డింగు చేయబడింది. ఈ షట్కాన్ని సూర్యకుమారిగారే స్వరపరచుకున్నారు. ఇంగ్లాండులో ఆవిడ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోను పాడేవారు.

వెల్చేరు నారాయణరావుగారు మనకు ప్రసిద్ధ సాహితీ విమర్శకులుగా, విద్యావేత్తగా మాత్రమే తెలుసు. కానీ ఆయన ఒక కవి అని మనలో ఎక్కువమందికి తెలియదు. ఆయన వ్రాసిన మంచి కవితలు అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ ఒక సంపుటంగా తీసుకురావాలని మేము సంకల్పించాము.

ఆ సంధియుగములో తెలుగు సాహిత్యములో ముగ్గురు హేమహేమీలు ఉండేవారు, వారు – కొక్కొండ వేంకటరత్నము పంతులు, కందుకూరి వీరేశలింగం, వేదం వేంకటరాయశాస్త్రి. అందరూ చిన్నయ సూరి విధానమే అనుసరించారు. కాని వారి మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువ. ముగ్గురికీ మూడు పత్రికలు ఉండేవి.

2000 సంవత్సరం ఆగస్ట్ 18-19వ తేదీల్లో షికాగోలో జరిగిన రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో “సాహిత్యం – స్త్రీల చైతన్యం” అనే అంశం మీద డా. కోలవెన్ను మలయవాసినిగారి ప్రసంగం వీడియో ఇది. ఈ ప్రసంగంలో వారు సాహిత్యంలో ఉపేక్షిత పాత్రలైన అనసూయ-ప్రియంవద, ఊర్మిళ, శ్రుతకీర్తులను ప్రస్తావించారు.

ఆమెని గుర్తు పట్టగానే అక్కడున్న మిగతా స్త్రీలందరూ నిర్ఘాంత పోయారు. మెల్లిగా వారిలో వారు గుస గుసలు పెట్టుకున్నారు. “సిగ్గులేని మొహం”, “తగుదునమ్మా అంటూ వీధిలోకొచ్చింది” పెద్దగానే మాటలు వినపడటంతో ఆమె తలెత్తి చూసింది.

ఓసారి పండక్కి అమలాపురం వెళ్ళినప్పుడు ఎప్పటిలాగే వీళ్ళని కలవడానికి వెళ్ళాను. అబ్బులు రాలేదు. ఏవిటాని ఆరా తీస్తే అతని ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిందనీ, ఆ బాధ భరించలేక దేవదాసయ్యాడనీ విన్నాను. ఆ అమ్మాయికి వేరెవరితోనో పెళ్ళికుదిరిందనీ తెలిసింది. నేనూ, వకీలూ, కన్నబాబూ అబ్బులింటికి వెళ్ళాం.

ఎప్పటికీ సీత రాకపోతే ఆయనకి చాలా కోపం వచ్చి పడకగది తలుపు గడియ పెట్టేస్తాడు. నీ పనులిలా ఉన్నాయా, నీకు వొళ్ళూ పై తెలియడం లేదు అని తల పంకించి ‘కడు భ్రమ చెంది’ పక్కమీద పడుకుంటాడు. ఇక్కడ ‘భ్రమ చెందడం’ చాలా అర్థవంతమైన మాట. రాముడు తనకి సీత మీద లేని అధికారం ఉన్నదని ఊహించుకుంటున్నాడు.

అప్పల్నర్సిమ్మడికి తర్కం బోధపడలేదు. “సూడండి బాబులూ. మీకేఁవో నానెవర్ని సంపినా పర్నేదు. నాకు మాత్రం ఖదీరుగాడే గావాల. ఆడికి బదులు, ఆడికేవిటికీ సమ్మందం లేనోల్లని సంపీడానికి నా మనసొప్పుకోదండి. అన్నెం పున్నెం తెలీనోల్లని చంపి ఆల్ల ఉసురు నేనెందుకండీ పోసుకుంట?” అని వాదించేడు.

న-కార, ణ-కారాల గురించి, నతిసూత్రం గురించి ఈ మధ్య ఈమాట-అభిప్రాయవేదికపై చర్చ జరిగింది కాబట్టి ఋగ్వేద ప్రాతిశాఖ్యలోని పంచమపటలంలో నతిసూత్రం వివరించిన సంస్కృతశ్లోకాలకు తెలుగు అనువాదం ఈ విడత పలుకుబడిలో భాగంగా అందజేస్తున్నాను. అలాగే కళింగత్తుపరణిలో కరునాడు ప్రస్తావన ఉన్న పద్యం గురించి నా అభిప్రాయం కూడా.

శ్యామ్ కథనా శైలి మరెక్కడా చూడం. అదొక ఏకైక రచనా శైలి. ఏ శైలి అయితే ఆయన కథలకి శక్తిగా, ప్రయోజనకారిగా మారాయో అవే ఆయన కథలకి బలహీనతా, లోపాలయి కూర్చున్నాయి. ఆ శైలికీ, ప్రాసలకీ, వాక్యాలకీ అబ్బురపడి అసలు కథ ఏవిటో మర్చిపోతాం.

ఒక ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న మనస్వి స్వానుభవపు తీవ్రత దీనిలో కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. గుండెలోని బాధని గుదిగుచ్చి పోసిన కవిత ఎంత ఆర్ద్రంగా, హృదయస్పర్శిగా వుంటుందో చెప్పడానికి ఈ చక్కని పద్యం ఒక మంచి ఉదాహరణ.

విలాయత్‌ఖాన్ సితార్ కచేరీ మొదటిసారిగా మద్రాసులో 1965లో. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ స్వయంగా మొదటి వరసలో కూర్చుని, విని ఆనందించిన ఆ కచేరీకి చిట్టిబాబు కూడా హాజరయారు. అందులో విలాయత్‌ఖాన్ పిలూ రాగంలో తన తాతగారు ఇమ్‌దాద్‌ఖాన్, తండ్రి ఇనాయత్‌ఖాన్ వాయించిన పిలూ రాగపు గత్‌లను సగర్వంగా వాయించారు.

మాటలు పద్యాన్ని చెప్పవు. పద్యంలో మాటలు అర్థాన్నివ్వవు. ఆకారం అసలే ఉండదు. రూపం శూన్యం. మాటల్ని గట్టిగా పట్టుకొని చలిమిడి ముద్దలా పిసకండి. పోనీ, మాటల్ని పంచరంగుల ప్లే డౌ లా పిసకండి. పిసకగా పిసకగా పద్యానికి ఆకారం వస్తుంది. అప్పుడు కనిపిస్తుంది కవితలో విశ్వరూపం.

రామారావు, నాగేశ్వరరావు సరదాగా టెన్నిస్ ఆడడం కె.వి.రెడ్డి గమనించారనీ, అందులో ఒక బాల్ మిస్ అయిన రామారావు కోపంతో దాన్ని దూరంగా పడేట్టు బాదాడనీ, అది చూసి రెడ్డిగారు పాతాళభైరవిలో నాగేశ్వరరావుకు బదులుగా రామారావును తీసుకున్నారనీ ఎక్కడో చదివాను.

ఆ చిరునగవు సౌరభమంతకంత
నన్ను చుట్టుకొనంగ నా కన్ను లందుఁ
గమ్మె భాష్పచయము. బిచ్చగత్తె యంత
నొడలదొంతి తోడను నాదు కడకు వచ్చె.

జీవకణాల సంయోగవియోగాలు
భావకవుల భవిష్యత్కావ్యాలు
అనంత చరణాల ఈ జీవనగీతం
శతసహస్రవాద్యాల స్వరసంగమం

పర్వపర్వమునకు పద్యాలు పచరించి
పత్రికలకు పంపువాని విడచి
ఇరుగు పొరుగు జూచి చిరునవ్వు నవ్వెడి
వాని ఇంటికి జను వత్సరాది

ఎవరైనా మనుషులో, సమాజాలో కష్టంలో ఉన్నారని తెలుసుకుంటే వాళ్ళలోని ‘లోపాల్ని’ తప్పనిసరై ఎత్తి చూపించవలసినప్పుడు కూడా ఆ పనిలో సానుభూతి, కరుణ కనిపిస్తాయి. సృజనాత్మకమైన పని – అంటే కళ నిర్వహణ, అభివ్యక్తి ఎంత కష్టతరమో ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోగలిగితే అది ఒకరకమైన వందనానికి, కరుణకు దారితీస్తుంది.

వఱడు అంటే ముసిలి నక్కట. ఆ జంతువు ప్రతీకగా మానవ నైజాన్ని ఇంత సూటిగా చిత్రీకరించిన ఈ కథ మొదటి సారి చదివినప్పుడు నన్నెలా ప్రభావితం చేసిందో, ఇన్నేళ్ళ తర్వాత కూడా ఎప్పుడు చదివినా అలానే నన్ను పట్టి ఊపేస్తుంది.

యాసీన్‌కు ఊపిరాడ్డం లేదు. ఈ భయంతో బతకటం దుర్భరమనిపించింది. పైగా ఆ మనిషి జేబులోంచి చేయి తీయడేం? అతడి వాలకం బట్టి అతడు దాడి చేస్తాడనే అనిపిస్తుంది. అతడు దాడికి దిగితే ఏమవుతుంది? ఏం చేస్తాడతడు? అసలింతకీ, ఇంకా ఏం చెయ్యడేం?

పెళ్ళయి మూడు నెలలకి పైనే అయ్యింది. పొద్దునే లేచి, సానుపు జల్లి, ముగ్గు పెట్టి, వంట చేసి ముసలాడికి వేడిగా పెట్టి మిగిలినదాన్ని కన్నెమ్మ తింటుంది. రోజూ ముసలాడు బయలుదేరి ఎక్కడికో వెళ్ళేవాడు. ఎక్కడి వెడుతున్నానని గాని, ఎందుకు అని గాని ఏమీ చెప్పడు. ఈమె కూడా దాని గురించి ఎక్కువగా దిగులు పడింది లేదు.