విజయరాఘవరావు తన కళాజీవితాన్ని భరతనాట్యంతో మొదలు పెట్టినప్పటికీ, ఆయన వేణువునేకాక, వాద్యబృంద నిర్వహణనూ, మెళుకువలనూ, స్వరరచననూ, సంగీతప్రసంగాలనూ అద్భుతంగా నిర్వహించారు. ఆయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీలతో బాటుగా బెంగాలీవంటి ఇతరభాషలు కూడా క్షుణ్ణంగా వచ్చు.

నువు నా చుట్టూ నా చూపు కోసం, నవ్వు కోసం తిరగడమే గుర్తుంది కానీ నేను నీ చుట్టూ తిరగడం ఎప్పుడు మొదలయిందో గుర్తు రావడం లేదు. మనం రహస్యంగా కలుసుకోవడానికి ప్లాన్స్ వేసుకోవడమూ, ఎప్పుడెప్పుడా అని ఆత్రంగా ఎదురు చూడటమూ గుర్తుకొస్తాయి. కొన్నిసార్లు మనిద్దరమూ కూచుని చెప్పుకున్న కబుర్లు గుర్తు చేసుకుంటాను.

గత నాలుగు నెలలగా మన ఇంట్లో పొదుపు ఉద్యమం సవ్యంగా సాగిపోతోంది. రేపు మనం నవ్వుతూ బతకడానికి ఈ వేళ ఏడ్చినా ఫరవాలేదు అనే పొదుపు ధర్మ సూత్రం ఆధారంగా, రేపు మనకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు బంగారంలా ఉండాలని ఈ వేళ సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఉద్రేకంతో పొదుపు చేసేస్తున్నాం.

అమ్మ నాకు జడ గంటలేసి, పచ్చని చేమంతి చెండు ఈ జడ మీంచి ఆ జడ మీదకి అర్థ చంద్రాకారపు వొంపు తేల్చి జడలల్లేది. పేరంటాలలో అందరూ నా జడల్ని చూసి మెచ్చు కుంటూంటే నా కంటే అమ్మకే ఎక్కువ ఆనందమేసేది. వంటింట్లో భోజనాల సమయంలో గమనించేదాన్ని; అందర్లోనూ భోగి ‘పండగ తలంటి’ కళ కొట్టొచ్చినట్టు కనిపించేది.

“నన్ను క్షమించండి.” అన్నాను వాళ్ళను సమాధానపరుస్తూ. “బహుశా సవ్యంగా లేనిది నేనేనేమో. తప్పు నాలోనే ఉందేమో. ఎందుకో ఒక్క క్షణం నాకలా అనిపించింది. ఇప్పుడంతా మళ్ళీ మామూలుగానే, బాగానే ఉంది. దయచేసి నన్ను క్షమించండి.” అని మెల్లిగా వాళ్ళ మధ్యనుండి తల దించుకొని బయటకొచ్చాను.

అదేమి వింతో, దాని గురించి నాకు ఇదేమి చింతో అర్థం కాదు. సరిగ్గా నేనిలా ఉన్నప్పుడే కరెంటు ఉండదు. బయట సూర్యుడు దాక్కుంటాడు. లోపలా, బయటా, చీకట్ల మధ్య నేను మిగిలి, ఏమిటీ చీకటి? అని ఆలోచిస్తూ ఉంటాను. ఏమన్నా సాయం వస్తావేమో అని పక్కకి తిరిగితే, అప్పుడు మాత్రం కనబడవు.

ఇందులో వ్యంగ్యం ఏ మాత్రం లేదు. తనవారిని కూడా వెదికించి ఖైదులో ఉంచమని ప్రాదేయపడటంలో తన భార్యాబిడ్డలకి కనీసావసరమైన పూటభోజనం సమకూర్చాలన్న తపన, ఆరాటం, సమకూర్చలేని తన అశక్తత, ఉరిశిక్ష వేసినా అన్నం పెట్టిన అధికారుల పట్ల అమాయకమైన కృతజ్ఞత మాత్రమే ఉన్నాయి.

“కాస్త నమ్మకంగా, ఖచ్చితంగా రెండువారాల కొకసారి వచ్చి లాన్‌ చేసే వాడిని, మరొకణ్ణి చూసుకోవాలి,” అని ఇద్దరూ అనుకుంటారు, గోమెజ్ రానప్పుడల్లా! గోమెజ్ రాగానే ఇద్దరూ ఆ విషయం మరిచిపోతారు! కారణం, వచ్చినప్పుడు లాన్‌ పని బాగా చేస్తాడు. పై పై పనులెన్ని చెయ్యమని చెప్పినా విసుక్కోడు.

మడత మంచం మీద కూర్చున్నప్పుడు, కిటికీ ఊచల నుంచి తన నుంచి అన్యాక్రాంతం అయిపోయిన ఆ కొబ్బరి తోటలో విరగ కాచిన కొబ్బరికాయల మీద చూపు నిలబడుతున్నప్పుడు నజీబు కళ్ళ ముందు వచ్చి నిలబడ్డాడు.

నర్తనశాల సినిమాలో ఘంటసాల గానం చేసిన ఈ పద్యం చాలామంది వినివుంటారు. భారతం విరాటపర్వం లోనిది ఈ పద్యం. కవి తిక్కన సోమయాజి. ఉత్తర గోగ్రహణ సమయంలో దుర్యోధనుణ్ణి ఓడించి, అతని ఎదురుగా నిలిచి అతన్ని ఉద్దేశించి అర్జునుడు ఎగతాళిగా ఎత్తిపొడుస్తూ చెప్పిన మాటలు ఇవి.

పొదల మాటున పెదవులద్ది
నడిమి రేయికి నదీ తటికి
వత్తుననెనే వ్రజకిశోరుడు
కదిలి పోదువె! వదిలి పోదువె!
నెచ్చెలివి గద విడిచి పోదువె
ఆగవే రజనీ! విభావరి!

సిరియాళదేవి క్రీ.శ.300 ప్రాంతములో కందారపురము రాజధానిగా ఆంధ్ర,తెలంగాణ ప్రాంతములలో కొంతభాగము నేలిన సోమదేవరాజు ధర్మపత్ని. ఈ సోమదేవునికి, ధాన్యకటకము (అమరావతి) ముఖ్యపట్టణముగా నేలుచుండిన బల్లహునికి నిరంతర యుద్ధములు జరుగుచుండెను.

ఆడవాళ్ళ వ్యక్తిత్వాలని నిబ్బరంగా నిలబెట్టిన రచన ఇది. ఇందులో పాత్రలకి వ్యక్తమైన మనస్సే కాకుండా సుప్తచేతన, అవ్యక్తభావాలు అనేకం ఉంటాయి. ఇలాంటివి ఫ్రాయిడ్‌ వొచ్చిన తరవాతే మన సాహిత్యంలో కనిపిస్తాయని విమర్శకులు అంటారు. అలా అనుకోవడం తప్పు అని ఈ పాట మనకి గుర్తు చేస్తుంది.

కథ సామాన్య పాఠకులని ఉద్దేశించే రాస్తాము. కాని సామాన్యుడికి శిల్పం అవగతం కాదు. కథ బాగుంటే ఎందుకు బావున్నది సామాన్యుడికి తెలియదు. కథ ఎందుకు బాగులేనిది అలాగ్గానే తెలియదు. సాహిత్యంలో నిష్ణాతులైన విమర్శకులు ఏ అభిప్రాయాన్ని ఇస్తారో ఆ అభిప్రాయమే సరియైనది అవుతుంది.

మన పద్ధతిలోన తర్క మీమాంసకి న్యాయ, వైశేషికాలని పేరు. మన తార్కికులు వితండము, జల్పము, వాదకధ అని తర్క వాదనని మూడు రకాలుగా ప్రతిపాదించేరు. వితండమంటే ప్రతివాదిని ఏదో ఒకలాగ, వెక్కిరింత, తిట్లతో సహా ఎలాంటి పద్ధతుల్నైనా వాడుకొని ఓడించి, నోరు మూయించే పద్ధతి.

కళ కళ కోసమే అనడం కళ ప్రజల కోసమే అనేదానికి వ్యతిరేకం కాదు. జాగ్రత్తగా గమనిస్తే ప్రజల కోసమే కళ. అంటే మొదట దేనినైతే మనం కళ అని పిలవదలచుకున్నామో అది కళ కావాలి కదా. కళ కాని దానిని కళ అని పిలిచి ఇది ప్రజల కోసం అనడం అసంబద్ధమయిన విషయం. కళ కళ కోసం కానిది ప్రజల కోసం కానేరదు.

నిగమశర్మ హోమాగ్నిని ఊదడట; కానీ విరహమనే జ్వరం యొక్క బాధతో వెచ్చని నిట్టూర్పులూరుస్తాడట. సంధ్యావందనం చేయడట; కానీ ఈర్ష్యాకషాయితలకు మాత్రం మక్కువతో నమస్కరిస్తాడట. వేద చర్చలలో ఔను-కాదు అనడు; కాని పెందలకడనే లేచి విటవాదములను తీరుస్తాడట.

తెలుగువాళ్ళకి దేన్ని ‘ఎక్కించా’లన్నా సినిమాలే శరణ్యం కనక శంకరాభరణం సినిమాలోని పాటలవల్ల శాస్త్రీయసంగీతానికి కొంత గ్లామర్ అబ్బింది. తద్వారా బ్రోచేవారెవరురా అనే కీర్తన కమాస్ రాగం లోనిదని చాలామందికి తెలిసింది.

మా ఊళ్ళో సాయిబులు పెద్దమ్మ, పెద్దనాన్నల సంతానంతో పెళ్ళి సంబంధాలు నెరపడం చూసి మా అమ్మమ్మ బుగ్గలు నొక్కుకొనేది. అయితే, ఉత్తరభారతీయులు మనం మేనమామ, మేనత్త కొడుకు, కూతుళ్ళతో మేనరికపు పెళ్ళిళ్ళు జరపడం చూసి అంతే ఆశ్చర్యపోతారు.

సినిమా పత్రికలంటే కేవలం సినిమా తారల ముచ్చట్లకే అని కాకుండా అప్పుడు కినిమాలో ‘మీ విజ్ఞానం’ అనే పేరుతో పాఠకులు అడిగిన సినిమా రంగపు టెక్నిక్స్ గురించిన ప్రశ్నలకి సమాధానాలిచ్చే శీర్షిక ఎంతో ప్రాచుర్యం పొందింది.

జేబున్నీసా ఔరంగజేబుకు ప్రియమైన కూతురు. రాజకీయ విషయాలలో ఆమెను సంప్రదించేవాడు. ఆమె తన పెద తండ్రి దారా షికోయొక్క ప్రభావము, ప్రోత్సాహము వలన కవిత్వము వ్రాయడానికి ఆరంభించినది. ఆమెకు అరబీ, పారసీక భాషలలో ప్రావీణ్యత ఎక్కువ. తన తండ్రి ఔరంగజేబ్‌వలె ఆమె భావాలు సంకుచితము కావు.

పరుచూరి శ్రీనివాస్ అందిస్తున్న 1930లనాటి ఊర్మిళాదేవి నిద్ర పాట ఇది. ఈ పాట పాడిన శ్రీమతి బి. సుబ్బులు గురించి ఇంకే వివరాలు మాకు దొరకలేదు.

ప్రపంచ తెలుగు ప్రజలకు అభివందనం! జనవరి 5-7 తేదీలలో, ఒంగోలు పట్టణంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహోత్సవానికి మీకందరికీ హార్దిక స్వాగతం పలుకుతున్నాం.

కొత్తసంవత్సరం ప్రారంభంలో అనేకమైన తీర్మానాలు చేసుకోవటం ఆనవాయితీ. బరువు తగ్గుదామని, బీడీలు తాగటం మానేస్తానని, బడికో, గుడికో దానధర్మాలు చేస్తాననీ… రకరకాల ప్రతిజ్ఞలు చేసుకోవటం మనకి తెలియని విషయం కాదు. అయితే అది వ్యక్తిగతమని, ఈ మాట పత్రికనీ కొందరు, నవ్వచ్చు; మరికొందరు కామెంటేతర్లు వెటకారం చెయ్యవచ్చు.