ఎమొరీ విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన, పరిశోధనల నిమిత్తం అధ్యాపక పదవి నెలకొల్పడానికై కొప్పాక వారు భూరి విరాళం ఇచ్చారు. మీ వంతు సహాయం మీరూ చేయమని విజ్ఞప్తి.

బాలగోపాల్ బహుముఖప్రజ్ఞుడు అనడం అతిశయోక్తి కాదు. సాహిత్య విమర్శకుడిగా, తత్వశాస్త్రవేత్తగా, సామాజికశాస్త్ర వ్యాఖ్యాతగా తెలుగునాట ప్రసిద్ధికెక్కాడు.

మా నాన్నా, మా బాబాయీ ప్రతిఏటా తల్లిదండ్రులకు తద్దినాలు పెడుతూ ఉండేవారు. ఒకసారి తమతో ఉపవాసం ఉండవలసిన పురోహితుడు కర్మకు ముందు రహస్యంగా హోటలుకెళ్ళి తినిరావడం వారి కంటబడిందట.

సరిత, రత్తాలు చేతులు రెండూ పట్టుకుని, “రత్తాలూ, నీ మేలు జన్మలో మర్చిపోలేను! వేళకు చక్కగా భోజనం చెయ్యి, పళ్లూ, పాలూ విడవకుండా తీసుకో. డబ్బు నీది, బిడ్డ మాది…అన్నది మర్చిపోకు సుమీ” అంటూ రత్తాలుకి చెక్కు అందించింది.

నిప్పులు కక్కుతున్న రామయ్యను ఎలా చల్లబరచాలో అమ్మకు తెలుసు. వాళ్ళకు ఈమె మీద చాలా గౌరవం! “పోన్లేప్పా! దానికి బుద్ధి లేదు! దాని బదులు నేను చెప్తున్నా. తప్పయిందిలే, ఏమనుకోవద్దండి!

“మనలో మనం” వేదిక, మహిళాధ్యయన కేంద్రం, నాగార్జున విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో 2009 నవంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్రస్థాయి రచయిత్రుల సదస్సుని ఏర్పాటుచేస్తోంది.

వసంతోత్సవం అనేది ఒక ఉల్లాసకరమైన పండుగ. ఇలాంటిదాన్ని వర్ణించే అవకాశాన్నీ ఏ కవి వదులుకుంటాడు? శ్రీనాధుని వంటి రాసిక్య రాశి అసలే వదులుకోడు.

అస్తమానూ, “ఉత్తరం రాయీ, ఉత్తరం రాయీ” అంటుంటే, “దేని గురించి రాయమంటావూ?” అని నేనడిగినప్పుడు, “ఏదో ఒకటి రాయి. పిల్లి గురించో, కుక్క గురించో రాయి” అంటావు కదా?

కొడవటిగంటి కుటుంబరావు కథల సంపుటి ‘స్వగతం’ పైన భారతి (జనవరి 1938) పత్రికలో బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం రాసిన విమర్శా వ్యాసం.

సాహిత్య సదస్సులో నేను ఏమిటి మాట్లాడాలి అనుకుంటుండగా “ఆ పాత సాహిత్యంలో ఏముంది మాట్లాడటానికి?” అన్న నా మిత్రుని ప్రశ్న నన్ను నిజంగానే ఆలోచింపచేసింది.

రెండు రోజుల సమావేశాలు సాహిత్యపరంగా చాలా ఆసక్తికరంగా జరిగాయి. దీనికి డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్బు ఎంతో కష్టపడి విజయవంతం చేశారు. పాత మిత్రులను కలవడానికి, కొత్తవారితో పరిచయం చేసికొనడానికి అవకాశం దొరికింది.

సౌందర్యమే సౌఖ్యము ;
సౌఖ్యమే -జీవిత సాఫల్యమని
ఎంచు కీట్స్ మధుర కాంక్షా నవతా
యువతా కవితా కల్పనా జగతి లోనే
నన్నుంచుమా! ప్రియతమా!

తెలుగులో శాస్త్రవిజ్ఞాన పుస్తకాల అవసరం ఇంకా ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి చేసిన ప్రయత్నమే రోహిణీప్రసాద్ గారు అంతరిక్షాన్ని గురించి రాసిన “విశ్వాంతరాళం” పుస్తకం.

మహీధర రామ్మోహనరావుగారు (వారి శతజయంతి కూడా ఈ సంవత్సరమే) కొడవటిగంటి కుటుంబరావు పంచకళ్యాణి నవల గురించి చర్చించిన ఈ వ్యాసాన్ని మీకందిస్తున్నాం.