నా కళ్లలో తెలీలేదా? ప్రేమ పాటలన్నీ పనిగట్టుకుని హై వాల్యూమ్ లో పెట్టినప్పుడు వికాస్ మాత్రం కంప్యూటర్లోకి దూరి ఉంటే ఎలా తెలుస్తుంది? నేను తనకేదో చెప్పాలని ఆరాటంగా వస్తే, తను చాట్ విండోలో జోక్ కి నవ్వుకుంటూ నా మాట వినిపించుకోనప్పుడు ఎలా తెలుస్తుంది?

గుర్రం జాషువా సాహిత్యానికి తగ్గ సంగీతం, సంగీతానికి దీటైన సాహిత్యం రెండూ పోటాపోటీలుగా కలవటం అరుదైన విషయం. మహాకవి గుర్రం జాషువా రచించిన నాలుగు […]

బహూశా విశ్వనాథ సత్యనారాయణ రావణాసురుడంతటి వాడు. ఈమాట నేను చులకన భావంతో అనడం లేదు. ఆయన సర్వజ్ఞత, సమర్థతల మీద అపారమైన గౌరవంతో అంటున్నాను. ఆయన ఊహాదృష్టి ప్రసరించని ప్రదేశం ఈ చతుర్దశ భువనాల్లో ఉండి వుండదు. ఆయన ఊహలూ, కల్పనల అపురూపత మరే కవిలోనూ కానరాదు.

ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? అన్న ప్రశ్నకి సమాధానం, గణితంలో ప్రవేశం ఉన్నవాళ్ళకి కూడా ఇంగ్లీషులో చెప్పటమే చాల కష్టం. గణితంలో ప్రవేశం లేని వారికి ఇంగ్లీషులో చెప్పబూనుకోవటం కష్టతరం. గణితంలో ప్రవేశం లేని వారికి తెలుగులో చెప్పటానికి ప్రయత్నించటం కష్టతమం.

స్వర్గ తుల్యమైన సుఖాలు వదులుకుని కట్టుబట్టల్తో సన్యసించాలంటే ఎంతటి మనోధైర్యం కావాలి? తథాగతుడైనాక ఒక్కసారి కూడా ‘నా మాట నమ్ము’ అని అనలేదని వింది.

వేపచెట్టుకింద తన కైనెటిక్ హోండాను నిలిపి దానికి ఆనుకుని నిలబడి, మేము చేస్తున్న ఆచారాలన్ని చూస్తోందో యువతి. “ఎవరామె?” అని అడిగాను. “ఆమే!…” గుసగుసగా చెప్పింది అక్క.

అభ్యుదయ కవిత్వం తెలుగువారిని ఉత్తేజపరిచిన 1950లలో ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారివంటి కవుల రచనలకు ఇంతటి ప్రజాదరణ కలగటానికి ఏకైక కారణం ఘంటసాల స్వరపరచి పాడడమే.

సర్వ సమగ్రమైన తెలుగు నిఘంటువు ప్రచురించటానికి సుమారు నలభై సంవత్సరాలు పట్టింది. అది ఈరోజు కొనదల్చుకున్నా దొరకదు. మనకి ఉన్న ఈ ఒకే ఒక సమగ్రమైన నిఘంటువు ఈ రోజున మనకు దొరకదు. ఇది హాస్యాస్పదమే కాదు; అవమానకరం కూడాను!

ప్రతీ రోజూ పట్టమ్మాళ్ ఇంటికి కూరలమ్మే ఒకామె కూతురు పెళ్ళికి పిలిస్తే, పట్టమ్మాళ్ వెళ్ళడమే కాకుండా అక్కడ తన పాటతో పెళ్ళికొచ్చిన పలువురినీ అలరించారట. సంగీతంలోనే కాక ఒక మనిషిగా కూడా ఎంతో ఔన్నత్యం చూపిన వ్యక్తి పట్టమ్మాళ్.