ఇరవయ్యో శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన సాహితీ మూర్తుల గురించి, వారి సాహిత్యాన్ని గురించి తెలుసుకోవడం, చర్చించడంతో పాటు, తెలుగు సాహితీ మిత్రుల్ని ముఖతః కలుసుకునే అవకాశాన్ని వదులుకోరని ఆశిస్తున్నాం.

అయినా పట్టు విడవకుండా ఈ పాటనే సాధన చేసే వాడిని. ఈ పాట తప్ప మరే పాటా పాడకుండా దాదాపు ఒక సంవత్సర కాలం ఈ రాగమాలికే సాధన చేసినట్టు గుర్తు.

మనం ఏ పద్యం చదివినా, విన్నా, అంతకు ముందు కొన్ని పద్యాలు వినే వుంటాం. అప్పుడు మనకి ఒక పద్యం అర్థం అయే తీరు, మనం అంతకు ముందు చదివిన, విన్న పద్యాల మీద ఆధారపడి వుంటుంది.

ముఖ్యంగా మన తెలుగిండ్లలో ఆడపడుచులకు వుండే స్వతంత్రం చెప్పనలవి గానిది. పెండ్లయి అత్తింటికి పోయినా పుట్టింటి ధ్యాస వుంటూనే వుంటుంది వారికి. అన్నలూ, తమ్ములూ, వారి కాపురాలూ క్షేమంగా వుండాలని కోరుకునేది ఆడబడుచే.

అప్పుడు అబ్బిగాడు చంటాడు. అకస్మాత్తుగా వాడికి జబ్బుచేసి ప్రాణమ్మీదికి వచ్చినప్పుడు, “స్వామీ! ఆపద మొక్కుల వాడా! బ్రతికి బట్ట కడితే, వీడి పుట్టువెంట్రుకలు నీ సన్నిధిలో తీయిస్తాను” అంటూ జానకి ఆ మొక్కు పెట్టుకుని ఐదేళ్లకు పైనే అయ్యింది.

ఇక్కడిదంతా ఒక ఫాషనైపోయింది. ఇన్నేళ్ళుగా పనికొచ్చిన పధ్ధతులేవీ ఇప్పుడు నచ్చవుట. ఇప్పుడు కొత్తగా ఏదో పొడిచెయ్యాలని మా మానేజర్ గాడి ఉద్దేశం.

నేను మాట్లాడినప్పుడల్లా ఆయనకి తన అమెరికా ప్రయాణం, ఎందుకొచ్చాడు అన్నది గుర్తొస్తుందట. వాళ్లబ్బాయిని నేను జాగ్రత్తగా పంపానన్నదీ గుర్తొస్తుందట. అంతే…

పొడుగైన భవంతులలోకి దూసుకొస్తూ ప్రయాణీకుల విమానాలు. పొగ, దుమ్ము, పరిచయమైన అవే ఆకారాల్లో, మబ్బుల్లా దట్టంగా. కిటికీల గుండా మంటలు బైటికి నాలికలు చాస్తూ.

రాగమాలిక అంటే వివిధ రాగాలనీ ఒక దండలా గుది గుచ్చడమన్నమాట. పాటలోని ఒక్కొక్క అంగమూ ఒక్కొక్క రాగంలో స్వరపరిచి రచన భావం, సౌందర్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే ప్రక్రియే రాగమాలిక.

కవి ఊహలకు, ఆ ఊహలకు ఊపిరి పోసేందుకు ఎంచుకున్న వర్ణాలను, చిత్రించడానికి ఎన్నుకున్న కుంచెలను చూసేక ఇది ఈ కవయిత్రి మొదటి కవితా సంకలనం అంటే ఆశ్చర్యమేసింది.

ఈ రోజు నేను కూడా ఒక తండ్రిని, నా పిల్లలు విదేశీవాతావరణంలో పెరిగిన వాళ్లు. ఫాదర్స్ డే రోజు బహుమతులను లేక విందు భోజనాలను లేక ఫోన్‌లో హర్షాభినందనలను ఇస్తారు.

మన శరీరంలోని కుడి ఎడమ భాగాలు సరాసరి బింబప్రతిబింబాలే. ముఖ్యంగా మన చేతులు ఈ దర్పణ సౌష్ఠవానికి ఒక గొప్ప ఉదాహరణ. కుడి ఎడమయితే వచ్చే పొరపాటు ఇంతింత కాదు!