ఈ కావ్యం పేరే ఒక పెద్ద మిస్టరీ! దీనికి ‘ఉత్తర హరివంశం’ అన్న పేరు సోమన ఎందుకు పెట్టాడో ఎవరికీ అంతుపట్టలేదు. పైగా, ఇదొక ‘తలా తోకా లేని’ కావ్యం.

త్యాగరాజుకి స్వతహాగా తమిళ భాషలో ప్రవేశమున్నా, ఒక్క కృతీ అందులో రచించలేదు. అంతే కాదు పరాయి భాషా పదాల్ని కూడా ఎక్కడా రానీయ లేదు.

ఒక పాఠకుడి ప్రశ్న: ‘నా ఫోటో విజయచిత్రకు ముఖచిత్రంగా వేస్తే ఎలా ఉంటుంది?’ కొండలరావుగారి జవాబు ‘మీ ముఖంలా ఉంటుంది!’

నన్నెచోడుని కుమారసంభవముపైన జరిగిన తర్జనభర్జనలు, వాదోపవాదాలు మరే తెలుగు కావ్యంపైన జరిగి ఉండలేదన్నది అతిశయోక్తి కాదు.

పథేర్ పాంచాలి సినిమా అంత బాగా తీద్దామనుకొన్నా, ఈ సినిమా విషయంలో తనకి కొంత ఆశాభంగం జరిగిందని రాయ్ స్వయంగా చెప్పుకొన్నాడు.

అవును. అప్పుడు నాకు బహుశా మహార్ణవ్ వయసే అనుకుంటాను. నాకు చీకటి అంటే భయం. నాభయం పోగొట్టడానికి అంటూ మా నాన్నగారు నన్ను చీకటి గదిలో పెట్టి తలుపేసేరు.

గణితవేత్తలు గోటింగెన్ యూనివర్సిటీకి రావడానికి కారకుడు డేవిడ్ హిల్బర్ట్ అయితే, వాళ్ళు పారిపోవడానికి కారకుడు అడోల్ఫ్ హిట్లర్.

ఒక కవి పద్యం మీద అభిప్రాయం చెప్పడానికి ఆ కవి ఎదురుగా లేకపోవడం ఒకరకంగా ఉపకారమేనేమో. చెప్పే విషయం కూడా, కొంత గోప్యంగా…

మొట్టమొదటిసారి ఈ కథ వ్రాతప్రతిలోచదివినప్పుడు, కథావస్తువులో స్పష్టంగా చలంగారు కనిపించారు. బహుశా ఇప్పుడూ చలంగారు కనిపిస్తారు.

అర్జునుడు ఈ విధంగా జనులను ఆశ్చర్యమగ్నులను చేస్తుండగా ద్వారం దగ్గరకు ఒక యువకుడు వచ్చి భుజం చరుస్తాడు. ఆ శబ్దం కొండ మీద పడే పిడుగుపాటు లాగా భయంకరంగా వినిపిస్తుంది.

ఓ పేదరికమా, నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతుంది. నువ్వేమో నన్ను స్నేహితునిలా అంటి పెట్టుకొని నాతోనే ఉన్నావు. నేనొక వేళ చచ్చిపోతే నీ గతేమవుతుందనేదే నా చింత సుమా! ఉన్నట్లుండి కొరడాతో కొట్టినట్లయింది.