రెండు గంటల పాటు జరగాల్సిన కచేరీ దాదాపు ఎనిమిది గంటల వరకూ జరిగింది. త్యాగరాజు సంగీతంలో మునిగి పోయి శరభోజి మహారాజు గోష్ఠి గురించి అందరూ మర్చిపోయారు.

సంప్రదాయం అనే పేరుతో ఎవరికి తోచినది వారు పాడుతున్నారనే ఫిర్యాదు కూడా వింటున్నాం. ఈ విషయంలో బాలమురళిగారి అభిప్రాయాలు తీవ్రమైనవి.

అనంతం! మనిషి మనసుని ఇంతగా ప్రభావించిన లోతైన ప్రశ్న మరొకటి లేదు. మానవ మేధని ఇంతగా ఉత్తేజింపచేసిన ఊహ మరొకటి లేదు. అయినా, అనంతం కన్నా స్పష్టం చెయ్యాల్సిన భావన మరొకటి లేదు.

పదహారు సంవత్సరాలు నిండితే కానీ జ్ఞానదంతాలు రావు. అయితే, చిన్నతనమేలే అని అశ్రద్ధ చెయ్య కూడదు. రాబోయే ఆరేళ్ళూ ఆ దంతాలు కొక్కిర్లు లేకండా సరిగా పెరిగేట్టు చూసుకోవాలి. జాగ్రత్త పడాలి.

వంగూరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 – 15, 2009 లలో హైదరాబాదులో “తెలుగు కథ శతవార్షికోత్సవం” పేరున సభలు జరపటానికి నిశ్చయించడం జరిగింది.

ఈ సమావేశంలో కవులు, కథా, నవలా రచయితలు, విమర్శకులే కాక సాహిత్యాభిమానులు ఎందరో పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ-మెయిలు ద్వారా, రచ్చబండ ద్వారా పరిచితులైన ఎందరో మిత్రులను కలుసుకొని మాట్లాడే భాగ్యం కలిగింది.

అప్పుడప్పుడు మా ఆవిడ, అబ్బాయిలతో గుడికి వెళ్తుంటా. వాళ్ళ లాగే నేనూ దణ్ణం పెట్టుకుంటా. గుళ్ళో దొరికే ప్రసాదం తింటా. కొన్ని సార్లు దణ్ణం పెట్టుకోడానికి ముందే ప్రసాదం తెచ్చుకుని తింటా.

జొన్నగడ్డల వేంకటేశ్వర శాస్త్రికి ఈ ఏడాది బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాము. ఇస్మాయిల్ అవార్డుకు పి.మోహన్ కవితా సంకలనం “కిటికీ పిట్ట”ఎంపికైంది.

కాలిన న్యూస్ పేపర్లో ఇంకా నిలిచిన అక్షరాల్ని చదవటానికి ప్రయత్నించినట్టు, గతం పొరల్లో అప్పుడప్పుడు ఆయన గురించిన స్మృతుల్ని చదవటానికి ప్రయత్నిస్తాను.

ఈ పదేళ్ల కాలగమనం తర్వాత పునఃపరిశీలిస్తే, వీటిలో కొన్ని ఊహలు నిజమయ్యాయి. ఇంకొన్ని అనుకున్న దిశలోనే కదుల్తున్నాయి కాని అనుకున్నంత వేగంగా కదలటం లేదు.

వచ్చిన ప్రశంసల వల్ల పథేర్ పాంచాలి సినిమాకి గొప్పతనం రాలేదు. ఈ సినిమా తియ్యటంలో చూపిన వైఖరి వల్ల ఇది గొప్ప సినిమా అయ్యింది.

“ప్రియా, ఈ మహావిశ్వంలో ఏ నక్షత్రాల మధ్య ఏ లోకంలో ఉంటావో తెలుసుకోలేకపోయినాను.”
“నేనేం తెలుసు నీకు?”
“..నువ్వెవరో నాకు తెలీకపోతే నువ్వెవరో నీకు కూడా తెలీదు.”

“దొంగరాముడులో క్యారక్టరు వేయాలంటే నాకు కొంచెం భయం వేసింది. అది కొంచెం గయ్యాళి పాత్ర, చేయగలనో లేదో. అలాగే తెలుగు కూడా యాసతో మాట్లాడాలి, సరిగ్గా వస్తుందో రాదో” అంటూ మహానటి చెప్పిన ముచ్చట్లు.

కవిత్వాస్వాదనకు ఉపయోగపడే పరికరాలు తిరిగి గుర్తొచ్చే వెనకటి జ్ఞాపకాలు – recovered memories. ఒక కవిత చదవగానే పాఠకుడికి వెలికి వచ్చిన జ్ఞాపకాలు, ఆ కవితని అనుభవించి ఆనందించడానికి ఉపయోగపడే సాధనాలు.

గౌరి పరమ సుకుమారి. గొప్ప సౌందర్యవతి. వయస్సులో వున్న కన్యక. మిక్కిలి నిష్ఠతో, శివారాధన తాత్పర్యంతో, నితాంత తపోవృత్తిలో నున్నది. చక్కనమ్మ చిక్కినా అందమే గదా.

నీవేమో నీ ప్రతాపంతో ఇంద్రుని గెలిచావు. కానీ నన్ను చెరపట్టి లాక్కు రమ్మన్నావు. చెరబట్టడం ఏం వినోదం? నీకు వినోదం గావచ్చు గానీ, చెరబట్ట బూనితే నా మనస్సు బాధ పడదా?

అప్పుడే కళ్ళు ఎత్తి నా కేసి చూసిన ఆమె కళ్ళు ఒక్క క్షణం నా కళ్ళతో కలుసుకున్నాయి. ఆ కళ్ళలో నాకు చాలా చిరపరిచితమైన భావాలు! అప్రయత్నంగా చేతిలోని పెన్ను టేబిల్ పై పడేసాను. పరీక్షగా ఆమె కళ్ళలోకి చూసాను.

అతనికి తెలుసు. ఆమె భౌతికంగా ఈ ఇంట్లో ఉంటుంది. ఇన్ని దేశాల కథలు చదివిన ఆమె మానసికంగా ఎక్కడ ఉంటుందో, కట్టడులు సంకెళ్ళు వేసుకునే ఆ ఇంటిలోని వారికి తెలియదు. ఆమె ఎందుకు ఏడుస్తున్నదీ వారికి తెలియదు.