“‘మదర్స్ డే’ నాడు మదర్స్ లా వుండక్కర్లేదు. ‘ఫాదర్స్ డే’ నాడు ఫాదర్స్ లా వుండక్కర్లేదు.ఇదేమీ బాగో లేదు అస్సలు” అంది నిక్కచ్చిగా. “పోదురూ! మీకు చాదస్తం ఎక్కువ. అలాంటివి పట్టించు కోకూడదు” అంది మొదటావిడ హాస్యంగా.

“స్నేహ పూజగది పెట్టించుకుంటేనే నానా హడావుడీ చేసావు కద అప్పట్లో… అసలు నీకూ, తనకీ ఈ విషయంలో ఇంత తేడాగా ఉండగా ఇద్దరూ ఎలా కలిసారో? అని కాలేజీలో అందరూ అనుకునేంత లెవెల్ లో నువ్వు నాస్తికుడిలా కటింగ్ ఇచ్చేవాడివి కదరా … ఒక్క రాత్రిలో ఏమైంది నీకు?”

అమెరికాలో దిగడి ముప్పై ఏళ్లు దాటుతోంది.. గత ఇరవై యేళ్లలోనూ ఏడు కంప్యూటర్లు మారేయి. అయిదున్నర ఇంచీల ఫ్లాపీలనుంచి అరచేతిలో ఉసిరిక్కాయల్లా ఇమిడిపోయే సీడీలదాకా సాంకేతిక ఇంద్రజాలంలో పడి కొట్టుకుపోతున్నాను

ధూర్జటి గొప్ప శివభక్తుడు. ఆయనకు సర్వమూ శివమయం గానే కనిపించింది. ఆ రాత్రి ఉదయించిన చంద్రబింబమూ శివలింగం గానే తోచింది.

ఠాగోర్ 1901 సంవత్సరంలో రాసిన ప్రఖ్యాత బెంగాలీ నవల “నష్టనీర్” (చెదిరిన గూడు) ఆధారంగా 1964 సంవత్సరంలో సత్యజిత్ రాయ్ తీసిన బెంగాలీ సినిమా “చారులత”.

ఎన్నెన్నో ప్రశ్నలు అన్నింటికి జవాబుగా
ఔనుకు కాదుకు మధ్య ఖాళీ స్థలంలో
అనాదిగా వూగుతున్న లోలక నిశ్శబ్దం

బుట్టోణ్ణి బుట్టోడా అని కాక, మరేపేరుతో పిలిచినా వానికి సిగ్గు. సియ్యలకూర తిని, రెండుపొట్లాల సారాయి తాగినప్పుడు శివునికి కొడుకు మీద వాత్సల్యం పొంగి “సీనారాయుడూ” అంటూ బయటపడుతుంది.

కూతురికి 13-15 సంవత్సరాల వయసు ఉండవచ్చు. ముదురాకుపచ్చ లంగా మీద లేతాకుపచ్చ ఓణీ కట్టింది. ఆరోజే తలంటినట్టున్న జుట్టును వదులుగా వదిలి ఒక రబ్బరుబాండు పెట్టింది. చిన్న బొట్టు.. మెడలో సన్నని గొలుసు.. ఎందుకో తనలో తానే నవ్వుకొంటూ మురిసిపోతోంది. ఇంతలోనే నాయుడుగారు రంగంలోకి దిగిపోయారు.

ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తు. అప్పుడు నాకు పదేళ్లు. నీకు ఒక తమ్ముడినో చెల్లెలినో తెస్తానంటూ అమ్మ ఆస్పత్రికి వెళ్లింది ముందు రోజు.

పుస్తకాలు, గడియారాలు, నేత మగ్గాలు – వీటన్నిటి సాంకేతిక జ్ఞానాన్ని కలిపి రూపొందించిన గణన యంత్రాలు – ఆధునిక కంప్యూటర్లకి పూర్వగాములు. ఆ యంత్రాలనీ, జీవితాంతమూ వాటి నిర్మాణంలో గడిపిన 18వ శతాబ్దపు మేధావి ఛార్లెస్ బాబేజ్‌నీ (Charles Babbage) పరిచయం చెయ్యడానికే ఈవ్యాసం.

అంతకన్నా తెలివైన పని, ఆ చామన ఛాయ వాళ్ళకి పెద్దపెద్దవిమానాలు ఇచ్చి, పెద్దపెద్ద బాంబులు చేసుకోడానికి సహాయం చేస్తే, వాళ్ళు మనపార్టీలో చేరచ్చు,

నిసికి ఒక్క సారి చిరపరిచితుడయిన శత్రువు ముఖంలో ముఖం పెట్టినట్లయ్యింది. షెర్లాక్ హోమ్స్‌కి గాని హంతకుడు అనుకోని ప్రదేశంలో, ఆకస్మికంగా వచ్చి ఎదురు నిలిస్తే…

ఆటో మూసీ బ్రిడ్జ్ దాటింది. ఎందుకో అక్కడి వాతావరణం లో తేడాగా అనిపిస్తూ ఉంది. రోడ్డు పై జనం హడావిడిగా, కంగారుగా, భయం భయంగా వెళుతునట్టనిపించింది.

బాలిక యువతిగా మారే విధంగా రాత్రిళ్లు పొడుగవుతున్నాయి. యువతివలెనే రాత్రి కూడా తళుక్కుమనే తారాగణాలనే నగలను ధరించింది.

“సరస్వతీ దేవికి సంగీతం, సాహిత్యం రెండు కళ్ళు” అన్న నానుడి ననుసరించినట్లుగా ఈ సాహితీ సదస్సు శ్రీమతి సీత నిష్టల వీణా వాదన ప్రార్థనా గీతంతో ప్రారంభించబడింది.

భాషాశాస్త్ర రంగంలో మహత్తరమైన కృషి చేసినందుకు భద్రిరాజు కృష్ణమూర్తిగారిని అభినందిస్తూ సి.పి. బ్రౌన్ అకాడమి, “తెలుగు భారతి” పురస్కారాన్ని ఆనందంతో అందజేస్తున్నది.

జ్యోతిష్కులు కారకత్వాల పేరుతో ఒక సాంకేతిక పదజాలాన్నీ, తత్సంబంధమైన ప్రాపంచిక దృష్టినీ అలవర్చుకుంటారు. ఈ రోజు ఇన్కమ్ టాక్స్ వాళ్ళతో సమస్య వచ్చింది. ఓహో, బుధ, శనుల పాపదృష్టి వల్ల ఇలా అయింది అన్నమాట.