కానీ, పాఠకుల స్పందన, రచయిత వివరణా, సంజాయిషీల తదుపరి మా నియమాన్ని సడలించి ఈ కథను ఈ సంచికలో ఉంచడానికే మేము నిర్ణయించాం. అయితే ఇలాంటి ఇబ్బంది ఇంకోసారి రాకుండా, రచయితలు ఇటువంటి పొరపాట్లు జరగకుండా మరికొంచెం శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాం.

“ప్రయాణికులకు గమనిక” అని మొదలెట్టే ఈ ప్రకటనలు వినేవారి గ్రహణ శక్తికీ, వినికిడి సామర్ధ్యానికీ, తప్పిపోయే రైళ్ల సాక్షిగా పెట్టని పరీక్షలు.

టీవీ వచ్చాక నాటకం దక్షిణ దిశగా మరింత వేగంగా పయనించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం నాటక రంగం ఎలా తయారయ్యిందంటే అది టీవీలో అవకాశాలు సంపాదించడానికొక వేదిక (ఫ్లాట్ ఫారం) లా తయారయ్యింది. నటీనటుల శిక్ష ణా కేంద్రంగా తయారయ్యింది.

తిమ్మకవి సృష్టించిన ‘సత్యభామ’ ఒక మహాద్భుతమైన పాత్ర. మామూలుగా భారత భాగవతాల్లో కనిపించే సత్యభామ కాదు పారిజాతాపహరణంలో కనిపించే సత్యభామ. తిమ్మకవి సత్యభామకు కల్పించిన రూపే వేరు.

కవులు తమ కావ్యాలను ఏ దైవానికో లేక ఏ మహారాజుకో అంకితము చేస్తారు. అప్పుడు ఆ కృతిభర్తపరముగా ఈ షష్ఠ్యంతములు చెప్పబడుతాయి.

మంచి చెడ్డలు రాశులు పోసినట్టు ఉండనట్టే జ్యోతిష సూత్రాలు అన్నీ విస్పష్టంగా నలుపు, తెలుపు రంగుల్లో గీసినట్టు ఉండవు. అవి చాలా అలోచింప జేస్తాయి. చాలా ఆకర్షణీయమైన సిద్ధాంతాలుగా ఉంటాయి.

బ్లాగులతో ఒక సుఖం ఉంది. ఏ భాషలోనైనా సరే, నీ ఇష్టమైనట్టు రాసుకోవచ్చు. నీ ఇష్టమైనప్పుడు రాసుకోవచ్చు. నీ ఇష్టమైన విషయం గురించి ఎక్కడో మొదలెట్టి మరెక్కడో ముగించవచ్చు. అసలు ముగించక పోవచ్చు. ముఖ్యంగా, బ్లాగన్నది ‘నీ కోసం నువ్వు రాసుకుంటున్నమాటల మూట.’

అంతర్జాతీయ సినిమా దర్శకుల్లో గొప్ప పేరు వచ్చిన జాపనీస్ సినిమా దర్శకుడు అకీరా కురొసోవా (Akira Kurosowa) తీసిన సినిమా “రషోమాన్” (Rashomon) కథకు మూలం ఒక తాత్వికమైన ఆలోచన.

నడిచే విజ్ఞాన సర్వస్వంగా, అపర అరిస్టాటిల్‌గా పేరు తెచ్చుకున్న లైబ్‌నిట్జ్ జీవితాన్నీ, బహుముఖ ప్రతిభనీ, కంప్యూటర్ సైన్సుకి మూలాధారమైన అతని విప్లవాత్మక ఆలోచనలనీ ఈ వ్యాసం ద్వారా రేఖామాత్రంగానయినా పరిచయం చెయ్యాలని నా ఉద్దేశం