ఈమాట » జనవరి 2008

విషయ సూచిక: జనవరి 2008

ఈమాట జనవరి 2008 సంచిక విడుదల

ఈమాట జనవరి 2008 సంచికలో –

ఉత్తర అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులలో మూడు రకాల తెలుగువారిని వారి మాటల ద్వారా గాక, చేతల ద్వారా ఎలా గుర్తించవచ్చో వివరిస్తూ వేలూరి వేంకటేశ్వరరావు సంపాదకీయం: “నా మాట

ఇంకా విశేషాలు –

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

నా మాట

ఎవరైనా కొత్తవాళ్ళు ఒక్కసారి తూర్పునుంచి పడమరదాకా, ఉత్తరం నుంచి దక్షిణందాకా ఈ దేశంలో చూస్తే ఒక్క సంగతి స్పష్టంగా బోధపడుతుంది. ఇక్కడి తెలుగు సంస్థల్లో మూడు రకాల తెలుగు వాళ్ళు ఉన్నారు.

పూర్తిగా »       3 అభిప్రాయాలు

కోవెలలో పకపకలు

శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

తీర్థం తాగి చెయ్యి నెత్తిమీద ఎందుకు రాసుకుంటారో అర్థం కాదు నారాయణకి. యింకా చాలా విషయాలు అతనికి అంతు పట్టవు. సంస్కృతంలో సుప్రభాతం, ఆనక వేద మంత్రాలూ చదివి, అరవంలో తిరుప్పావయ్యో మరేదో చదువుతారు కదా, మరి తెలుగులో ఏవీ చదవరెందుకు? యింతకీ వెంకటేశ్వర స్వామిది యే భాష?

పూర్తిగా »       19 అభిప్రాయాలు

అబద్ధంలో నిజం

మా బెడ్ పక్కనే ఏడాది క్రితం వచ్చిన బెస్ట్ కపుల్ అవార్డు ట్రోఫీ ఒక్కటే ప్రపంచానికి కనబడే నిజం!

పూర్తిగా »       9 అభిప్రాయాలు

నిన్నటి కల

అతడిని అంతకు ముందు ఎక్కడ చూసానో గుర్తొస్తోంది! సాయంత్రం సన్మాన సభలో నేను చేయ బోయే ప్రసంగానికి పీయ్యే సహాయం అంతగా అవసరం లేదు. పాతికేళ్ళ క్రితం నేను చదువుకునే రోజుల్లో, నా స్కాలర్‌షిప్ పని మీద కలుసుకున్న వీయస్సార్, ఈ వీధుల సుబ్బరామయ్యా ఒక్కరే!

పూర్తిగా »       10 అభిప్రాయాలు

మనీప్లాంట్: అనువాద కథలు

ఈ నేపథ్యంలో కొల్లూరి సోమశంకర్ వంటి సమర్ధుడైన యువరచయిత ఇతర భాషల కథల్ని తెలుగులోకి తర్జుమా చెయ్యటం మీద తన దృష్టి కేంద్రీకరించడం అభినందించాల్సినదే. ఐతే ఉత్తినే దృష్టి కేంద్రీకరిస్తే ఏమైంది? ఇప్పటివరకూ 40కి పైన కథల్ని చక్కటి తెలుగులోకి అనువదించి వివిధ పత్రికల్లో ప్రకటించటమూ, వాటిల్లోంచి 19 కథల్ని ఏరి “మనీప్లాంట్” అని చిన్న సంపుటం వెలువరించటం - అదీ నిజంగా అభినందించాల్సిన విషయం.

పూర్తిగా »       3 అభిప్రాయాలు

నాకు నచ్చిన పద్యం - ఆముక్తమాల్యదలో చిక్కులో పడిన పల్లెపడుచులు

తన జైత్రయాత్రల సందర్భంగా కృష్ణా తీరంలోని శ్రీకాకుళం అనే వూరిలో ఒక రాత్రి ఉండగా, ఆ వూరి గుడి లోని శ్రీ ఆంధ్రమహావిష్ణువు కలలో కనిపించి ఆముక్తమాల్యద వ్రాయమని ఆదేశించినట్లు ఆయనే ఆ కావ్యంలో చెప్పుకున్నాడు. చెప్పినది తెలుగుదేశం లోని గుళ్ళో దేవుడు. వ్రాసినది కర్నాటక చక్రవర్తి. కథ జరిగినది తమిళ దేశంలో - ఎంత మంచి సన్నివేశమో గమనించండి.

పూర్తిగా »       4 అభిప్రాయాలు

యాత్ర

మనసొక్కక్షణం
మాష్టారు ప్రవేశించిన
తరగతి గది

పూర్తిగా »       4 అభిప్రాయాలు

వాడు

రెల్లు గడ్డి కింది తాబేటి భాష
తనకు తెలుసునని డబాయిస్తాడు

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

కలలు కోతకొచ్చాయి

దేవరపల్లి రాజేంద్ర కుమార్‌

కుక్కతోకతో గోదారి ఈదాలని
నడుము లోతుకు వెళ్ళి, కోరలు చూసాక తెలిసింది
అది గుంటనక్కకు గురువని.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

మెహఫిల్

ఏవీ ఆరుబైట మంచు బొమ్మలు?
ఏవీ ఆ చిత్రవిచిత్ర ఆకుల ఇంద్రధనస్సులు?
ఏవీ ఆ రెడ్‌కార్డినల్స్ స్వరఝరులు?
ఏవీ ఆ పడిలేచే అల్లరి తరంగాలు?
ఏవీ ఆ లేక్‌మెండోటా గుసగుసలు?

పూర్తిగా »       ఒక అభిప్రాయం

నా జ్ఞాపకం

మరోసారి కొరికేలోపే
జారిపోయిన బందరు మిఠాయిని.

పూర్తిగా »       3 అభిప్రాయాలు

షరా మామూలే

జే. స్వరూప్ కృష్ణ

మెరుపుల ఓణీతో, ఉరుముల గజ్జెలతో తాండవం చేస్తుంది వాన
ఆకాశానికి భూమికి మధ్య పేనిన తాడుల వాన

పూర్తిగా »       ఒక అభిప్రాయం

అనుభవం- జ్ఞాపకం

ఎప్పటిలాగే తెల్ల మంచు చీరని కట్టుకొని
ఈ నగరం క్రొత్త సంవత్సరం కోసం ముస్తాబవుతుంది

పూర్తిగా »       ఒక అభిప్రాయం

నడిమి వయసు యిడుములు

సరిపల్లె సూర్యనారాయణ

తే.గీ. పాత కొత్తల కలిపెడి సేతు వవగ
పిన్నపెద్దతరములకభిన్నమవగ
రెండుభాషలనందునుద్దండులవగ
నడిమి వయసు కత్తిపయిన నడక! నరుడ!

పూర్తిగా »       2 అభిప్రాయాలు

రంగులు

మూలా సుబ్రహ్మణ్యం

ప్రకృతి రంగులన్నిటినీ
దోచేసుకుని రాత్రి
ఎటో పారిపోతోంది

పూర్తిగా »       5 అభిప్రాయాలు

సప్తపది

నువ్వు చేయమన్నదల్లా
చేస్తూనే వున్నా
నువ్వు చూపిందల్లా
చూస్తూనే వున్నా

పూర్తిగా »       3 అభిప్రాయాలు

కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు - 1: శేష ప్రశ్న

కొడవళ్ళ హనుమంతరావు

“ఈ తీరని ప్రశ్న గురించి ఎంతమందికి తెలుసు? కంప్యూటర్ సైన్సు లోకెల్లా ఇంతకన్నా తెలుసుకోదగ్గ విషయం మరేముంది? దీని గురించి నలుగురికీ తెలిసే విధంగా ఓ వ్యాసం రాస్తే బాగుంటుంది గదా,” అని అనిపించింది.

పూర్తిగా »       12 అభిప్రాయాలు

ఎందుకు రాయాలో అందుకే చదవాలి

విష్ణుభొట్ల లక్ష్మన్న

“ఏరా నీ తెలుగు ఇలా ఉండేమిటీ?” అని అడిగితే, “నీకు తెలియదా బాబాయ్? నేను తెలుగు చదవటం మానేసి చాలా రోజులైంది! అందులో మనది హైదరాబాద్ తెలుగు!” అని నవ్వుతూ సమాధానం చెప్పాడు.

పూర్తిగా »       22 అభిప్రాయాలు

తెరమరుగవుతున్న తెలుగు నాటకం

ప్రస్తుతం తెలుగు నాటకం పరిషత్తులకే పరిమిత మయిపోయింది. సృజనాత్మకత కరువయ్యింది. నాటక ప్రదర్శనకి పట్టు మని పదిమంది కూడా రారు. ఏం చూస్తాం, ఇంట్లో టీవీ ఉంది, సినిమాలున్నాయి, మాకింకేం సృజనా అవసరంలేదనే స్థాయిలో నాటకం ప్రేక్షకులకోసం వెంపర్లాడుతోంది.

పూర్తిగా »       8 అభిప్రాయాలు

సర్వోత్తమ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్‌ఖాన్

ప్రపంచమంతటా సామాన్యంగా సితార్ అనగానే రవిశంకర్ పేరును తలుచుకుంటారు. ఒక భారతీయ శాస్త్రీయసంగీతజ్ఞుడు ఎంతటి ఖ్యాతిని పొందవచ్చునో నిరూపించిన మేధావి రవిశంకర్ అనడంలో సందేహమేమీ లేదు. అయితే ప్రతి అర్జునుడికీ సరితూగే ఒక కర్ణుడు ఉంటాడనుకుంటే అందుకు సరిగ్గా సరిపోయే వ్యక్తి ఉస్తాద్ విలాయత్‌ఖాన్‌. సితార్ చేత “పాడించి”, సితార్ వాయిద్యపు పరిధిని అపారంగా విస్తరింపజేసి, సితార్ శైలికే కొత్త భాష్యం చెప్పిన విలాయత్‌ఖాన్‌కు మరెవరూ సాటిరారని భావించేవారూ ఉన్నారు.

పూర్తిగా »       6 అభిప్రాయాలు

ప్లేటో ఘనస్వరూపాలు (Platonic Solids)

ఇట్టి ఘనస్వరూపాలలో మిక్కిలి ప్రసిద్ధి కెక్కినవి ప్లేటో ఘనస్వరూపాలు (Platonic solids). ఇవి ఐదు - చతుర్ముఖి (tetrahedron), ఘన చతురస్రము (cube), అష్టముఖి (octahedron), ద్వాదశముఖి (dodecahedron), వింశతిముఖి (icosahedron).

పూర్తిగా »       4 అభిప్రాయాలు

ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము

ఔరంగజేబు తనగురువుకి రాసిన ఉత్తరం కొమర్రాజు వేంకటలక్ష్మణరావు గారు 1910 లో పారశీకంనుంచి తెనిగించారు. ఆ అనువాదం దిగువన తెలుగులోవిద్యాబోధనపై ఆకాలంలో ఆయన అభిప్రాయాలు చదవచ్చు. 1910 తరువాత తెలుగు మాధ్యమంగా విద్యాబోధనలో వచ్చిన మార్పులు ఈమాట పాఠకులు గుర్తించగలరు.

పూర్తిగా »       2 అభిప్రాయాలు

తెలుగు జ్యోతి ఆహ్వానం

రాబోయే సర్వధారి ఉగాదికి, తెలుగు లలిత కళా సమితి (Telugu Fine Arts Society, NJ, USA ) తెలుగుజ్యోతి పత్రికావర్గం ఒక విశేష సంచికని మీ ముందరికి తీసుకు రాబోతోంది. ఈ విశేష సంచికలో ప్రచురించడానికి దేశవిదేశాల్లో వున్న తెలుగు భావుకులందరికీ ఈ ఆహ్వానం.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

Tree, My Guru కు CP బ్రౌన్ పండిత పురస్కారం

ఈ ఏడాది నుండి అనువాదం, పరిశోధనా, నిఘంటు నిర్మాణాల్లో కృషి చేసిన పండితులకు ఉడతాభక్తిగా ఒక పురస్కారం ప్రకటించాలన్న సంకల్పం. ఇందులో భాగంగా, కేశవరావు గారి అనువాద గ్రంథం Tree,My Guru కు CP బ్రౌన్ పండిత పురస్కారం.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి