కవులు, కథకులూ, వ్యాస రచయితలూ, చాలా సున్నితమైన వాళ్ళు. విమర్శలు సునిశితంగాను, సూటిగాను,పెళుసుగా లేకుండానూ చెయ్యడం అవసరం. ఈమాట అభిప్రాయవేదికలో వ్యక్తిగత దూషణకి తావు లేదు. ఓక్కొక్క సారి, పొరపాటున దూకుడుగా అనాలోచితంగా రాసిన వాక్యాలు కత్తిరించకండా ప్రచురించడం జరిగింది. అందుకు నా క్షమాపణలు. ఇక ముందు కత్తిరించవలసిన పరిస్థితి రాకుండా సహకరించమని నా మనవి.

ఊపిరి అందడంల్యా. యమకల్లో నొప్పి. కాలు వూడి రాకంటే ఊపిరి బిగిసి సస్తాననిపిస్తాంది. బాగన్నా యిరక్కపాయనే. నాకు మొగదాడు కుట్టకపోతేనేమి, సెప్పినమాట యినపోతినా నేను!?

హయగ్రీవశాస్త్రి ఇప్పుడు అనాధశవం. హనుమంతుకి పురాణం శాస్తుర్లు గారు ఎప్పుడో పురాణంలో పిట్ట కథలా చెప్పింది గుర్తుకొచ్చింది. అనాధ ప్రేత సంస్కారాత్ కోటియజ్ఞ ఫలం లభేత్, అని.

సంపత్ గారి వ్యాసం 1952 భారతి మాస పత్రికలో వచ్చింది. అంతకుముందు శ్రీశ్రీ కవిత్వం పై వచ్చిన వ్యాసాలన్నీ, “అభినందన ధోరణిలో జరిగిన గుణ సంకీర్తనలే.” శ్రీశ్రీ కవిత్వాన్ని లోతుగా పరిశీలించి విమర్శించే ప్రయత్నం ఇంతకు (1952 కు) పూర్వం జరగలేదు. ఆ రకంగ చూస్తే, సంపత్ గారి వ్యాసం seminal work అని చెప్పచ్చు.

ఒంటరిగా, ప్రశాంతంగా, స్వతంత్రంగా, ఆరోగ్యంగా పల్లెటూరిలో ఉండేవారు తాతయ్య. ఆయన జీవితంలో ఒక్క cataract ఆపరేషన్‌ తప్పించి డాక్టర్లు, మందులు, హాస్పిటళ్లు ఎరగరు. ఒకరోజు సాయంత్రం ఆవుపాలు పిండటానికి వెళ్ళిన తాతయ్య పదినిమిషాలలో లోపలికి వచ్చారు, ఎడమచేయి నొప్పి పుడుతున్నాదంటూ. పక్కింట్లో ఉన్న తన చిన్నకొడుక్కి కబురంపి, ఒక గంట తర్వాత కొన్ని దశాబ్దాలుగా ఆ ఇంట్లోనే తాను ఊగిన ఉయ్యాలబల్లమీద పడుకుని “శివ శివా” అంటూ కన్నుమూశారు.

ఇటీవల, అదృశ్యమైపోయిన కొన్ని జాతుల పక్షులు, జంతువులు తిరిగి కనబడడంతో శాస్త్రజ్ఞుల సంతోషాలకి అవధులు లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా మనం ప్రస్తావించుకోవలసినది ఒక అచ్చ తెనుగు పిట్ట: కలివి కోడి.

సంగీత సాహిత్యాలు రెండిటికీ సమ పాళ్ళలో ప్రాధాన్యత ఇస్తూ వరుసలు కూర్చి పాడితే లభించే మధురానుభూతి నిస్సందేహంగా అపరిమితమని నా వినీతాభిప్రాయమూ, మధురానుభవమూనూ.

శాస్త్రీయ సంగీతంలో జుగల్‌బందీ కచేరీలకి కొంత ప్రత్యేకత ఉంది. రెండు వేరువేరు శైలులనో, వాయిద్యాలనో ఉపయోగించి వాటి మధ్యనున్న సామాన్య లక్షణాలని ఈ కచేరీలు విశదం చేస్తాయి. ఇది జరుగుతున్న క్రమంలో ఒక్కొక్క శైలిదీ విశిష్టత మనకు తెలుస్తూనే ఉంటుంది. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అన్న పద్ధతిలో ఈ మిశ్రమ సంగీతాన్ని శ్రోతలు స్వాదించి, ఆనందించగలుగుతారు.

రోజంతా అవిశ్రాంతంగా ఆలోచనల
జలతారు పోగుల్ని నేసి నేసి
అలసిన స్పృహ వెచ్చని చీకటి గుహలలో
ముడుచుకుని పడుకుంటుంది

పార్టీ అయి అంతా వెళ్ళాక మర్చిపోకుండా మళ్ళీ అడిగింది తనే “పేకాట ఎప్పుడు, ఎందుకు వదిలిపెట్టారు”?