వంగురి ఫౌండేషన్ వారు రెండేళ్లకొకసారి నిర్వహించే ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు హ్యూస్టన్ మహా నగరంలో అక్టోబర్ 14-15 తేదీలలో జరగబోతోంది. తెలుగు భాషాభిమానులు, పండితులు, సాహిత్య విమర్శకులు, కంప్యూటర్ తెలుగు లిపి మొదలైన సాంకేతిక విషయాలలో నిష్ణాతులైనవారు, అమెరికాలో తెలుగు భాషను పెంపొందించదలుచుకున్న వారందరనీ ఈ ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో పాల్గొనమని “ఈమాట” ఆహ్వానిస్తోంది . ఈ సారి సదస్సులో ప్రముఖ చిత్రకారులు, సినీ దర్శకులు శ్రీ బాపు గారి చిత్రకళా ప్రదర్శన, “ఈమాట” ముఖ్య సంపాదకులు శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారు “సాహిత్యంలో హాస్యం” అన్న అంశం మీద చేయబోయే కీలకోపన్యాసం ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి.

అయితే భావకవిత్వం చేసిన ముఖ్యమైన పని ఇంకొకటి వుంది. అది దేశంలో ఒక మధ్యతరగతిని తయారు చేసి వాళ్ళ ఊహలద్వారా ఒక భారత జాతీయతని నిర్మించడం.

అస్తిత్వ వాద (Existentialism) ప్రభావంతో రచనలు చేసిన బుచ్చిబాబు, నవీన్, ఆర్. ఎస్. సుదర్శనం, వడ్డెర చండీదాస్ నవలను విశ్లేషిస్తూ అంపశయ్య నవీన్ గారు అట్లాంటాలో చేసిన ప్రసంగం ఇది.

సుందరి నిద్రాహారాలు మాని పిచ్చిదానిలా తయారయ్యింది. పరిచారికలు ఆమె పరిస్థితి చూసి బాధపడుతున్నారు. కాని సుందరికింకా ఆశ చావ లేదు. ఏ మూలో తన ప్రియుడ్ని కలుస్తానన్న నమ్మకం ఉంది.

ఈ ఉద్యమం సమాజంలోని అసమానతలను వ్యతిరేకించింది. అన్ని కులాలకు సమాన ప్రతిపత్తిని కల్పించింది. అయితే స్త్రీ విషయంలో పురుషునితో సమాన హోదాను కల్పించినా స్త్రీని భోగ్య వస్తువుగా భావించిన మత విధానాలు మనకు ఆశ్చర్యాన్ని, బాధను కలిగిస్తాయి.

ఇది కధ కాదు.ఇందులో పాత్రలు, సంభాషణలు, అపార్ధాలు, కొట్లాటలు, ప్రేమవివాహాలు ఇత్యాదులు లేవు.కేవలం జ్ఞాపకాల జాతర లో తప్పిపోయిన ఆలోచనా ప్రవాహానికి, అనుభూతికి రూపం ఇవ్వటానికి ప్రయత్నం మాత్రమే ఉంది.

ప్రిన్స్‌టన్ లో విద్యార్ధి దశలోనే మన భార్గవ ఇటువంటి సంధి సూత్రాలని మరో పదమూడింటిని కనుక్కున్నాడు. కనిపెట్టటమే కాదు, గణిత శాస్త్ర రీత్యా ఈ సూత్రాలు ఎలా ఉద్భవించేయో కూడ రుజువుతో సహా చూపెట్టేడు. ఈ పని ఫలితంగా భార్గవకి పట్టా ఇవ్వటమే కాకుండా 28 ఏళ్ళ చిరుత ప్రాయానికే ఆచార్య పదవి (full professor) ఇచ్చి గౌరవించింది, ప్రిన్స్‌టన్.

సంగీతమంటే కనీసం ప్రాథమిక స్థాయిలో “బ్రహ్మవిద్య” కాదని నా ఉద్దేశం. శాస్త్రీయ సంగీతాన్ని కొంతవరకూ “డీ మిస్టిఫై” చేసే ప్రయత్నమే ఈ వ్యాసం.

పద్యం పదిమందినోటిలో పడి, నలిగి, పదికాలాలపాటు ప్రజలు నెమరువేసుకుంటూ ఆనందించగల కవితలు రాసిన వాడు నిజమైన ప్రజాకవి. ఈ దృష్టితో చూస్తే, మనకి నిజమైన ప్రజాకవులు తిరుపతి వెంకట కవులు.

రచయిత వెలిబుచ్చిన అభిప్రాయాలలో చాల వాటితో నేను ఏకిభవిస్తాను. ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు తమ తమ మాతృ భాషలలో కాకుండా క్రమానుగతంగా అరబ్బీ, లేటిన్‌, సంస్కృతాలలో ప్రార్ధనలు చెయ్యటం ఎందుకు? దేవుడికి ఆ మూడు భాషలలోనే అర్ధం అవుతుందా? అని ధ్వనిస్తూ ప్రశ్నించేరు రచయిత.