అలాంటి ఇళ్ళని సినిమాల్లో తప్పాచూడని మంగ ఒక్క మాట కూడా మాట్లాడ కుండా చూస్తోంది. ఇళ్ళనీ, ఇళ్ళలో ఉన్న కార్లనీ, రక రకాల మొక్కల్నీ. ఇరుకు అపార్ట్ మెంట్లోంచి వచ్చిన మంగకి, వేరే ఏదో దేశం వెళ్ళినట్టుగా ఉంది.

గీరతం తెలుగుసాహిత్యంలో ఒక విలక్షణమైన రచన. అది రెండు పక్షాల కవుల మధ్య జరిగిన సంఘర్షణని చూపిస్తుంది. ఇందులో ఒకరు తిరుపతి వెంకట కవులు. రెండవ వారు వెంకటరామకృష్ణ కవులు. వీరిద్దరి వివాదాంశం చాలా విచిత్రమైంది.

డెట్రాయట్ తెలుగు వారు నాందీ వాక్యం పలికారు. వాళ్ళని అభినందించి తీరాలి. ఇదేవిధంగా, అమెరికా వ్యాప్తంగా, దక్షిణ ఆసియా భాషల్లోను, సంస్కృతంలోనూ బోధన స్థిరపడ్డ ప్రతి విశ్వవిద్యాలయంలోనూ తెలుగు భాషా బోధనకి, తెలుగు సాహిత్య పరిశోధనకీ, అవకాశం కల్పించవలసిన అవసరం ఉన్నది.

మీరు నమ్మండి, నమ్మకపొండి. నేను నడకకి వెళ్ళిన ప్రతి రోజూ – దరిదాపుగా ప్రతిరోజూ – దారిలో నేల మీద ఒక పెన్నీ (సెంటు లేదా పైస) కనిపించి తీరుతుంది. కరువు రోజుల్లో పుట్టి పెరిగిన శాల్తీనేమో, ఒంగుని పెన్నీని తీసి జేబులో వేసుకుంటాను.

ముకేశ్‌కు తారస్థాయిలో అపస్వరాలు పలుకుతాయని నౌషాద్‌కు కొన్ని అభ్యంతరాలుండేవి. అందుకనే అందాజ్‌, మేలా మొదలైన సినిమాల్లో ముకేశ్‌ చేత అతను మంద్ర స్థాయిలో పాడించాడు. ఒక్క “తూ కహే అగర్‌” పాట కోసమని ముకేశ్‌ నౌషాద్‌ ఇంటికి వచ్చి 23 సార్లు రిహార్సల్‌ చేశాడట. అప్పటి కమిట్‌మెంట్‌ అటువంటిది.

మీ అందరి మాటలూ వింటూంటే, నేనిక్కడకి రావడంలో పెద్ద పొరపాటు చేశాననిపిస్తోంది. కొత్త మూలాన తికమకగా ఉందనుకున్నానుగానీ, ఎప్పటికీ ఇక్కడ ఇమడననీ, ఎప్పుడూ ఒంటరిగా ఉంటాననీ తల్చుకుంటే చాలా భయంగా ఉంది.

“ప్రతి శిశు జననం మానవ జాతి మీద భగవంతునికి మిగిలి ఉన్న నమ్మకాన్ని నిరూపిస్తుంది” అన్నట్టే ప్రతి కవిజననం మన భాష మీద మనకున్న ఆశను రెట్టింపు చేస్తుంది.

అసలు ఆయనే కాదు ఆయింట్లో ఎవరికీ నార్మల్ వాయిస్ వున్నట్టు లేదు. అందరివీ కాకలీ స్వనాలే! 90 డెసిబెల్స్‌కి పైమాటే!

నేను ఎన్ని సంవత్సరాలు కస్టపడి ఈ కంపెనీకి పని చేశాను. ఈ స్థాయికి చేరుకున్నాను. మా వంటి వాళ్ళ వల్లే గదా కంపెనీ ఇంత మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఊరికి కూడా పేరు వచ్చింది. ఇప్పుడు ఈ కంపెనీ తో కొంచెం కూడా సంబంధం లేని ఎవరో ఒకతను — వెధవ , వేరే ఊరి నుండి వచ్చి, ఈ ఊరిలో ఇన్నాళ్ళుగా పని చేసి పేరు తెచ్చుకున్న నన్ను ఉద్యోగం నుండి తీసి వేశాడు. ఎంత ధైర్యం!