ప్రజలని వేలి ముద్రలతో ఎలా పోల్చుకో వచ్చో అలాగే వ్యక్తుల మధ్య తారతమ్యాన్ని “నాలుక ముద్రలు” తో పోల్చుకో వచ్చేమోనని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. వేలి ముద్రలు జీవితాంతం ఒకేలా ఉంటాయి. కాని, “నాలుక ముద్రలు” జీవితంలో క్రమేపీ మారుతూ ఉంటాయి.

నామిని బడిపిల్లల కోసం ఒక పుస్తకం రాశారు. ఇందులో రచయిత సదుద్దేశాన్ని అపార్థం చేసుకోకూడదు. పిల్లలకి ఎన్నో మంచి విషయాలు చెప్పాలనే రచయిత తాపత్రయం. […]

శాస్త్రీయ రాగాలతో ఘంటసాలకు ఉండిన గాఢమైన పరిచయం, వాటిని సాహిత్యానికి ఎలా ప్రతిభావంతంగా వాడుకోవాలో తెలియడం, కొత్త రాగాలను ప్రవేశపెట్టి అవసరమైనప్పుడు వాటిచేత (శ్రీశ్రీ చెప్పినట్టు) “అందంగా చాకిరీ చేయించుకోవడం” ఆయనకు బాగా తెలుసు.

జరిగిన విషయం తిరిగి చెప్పినచోట్లు చాలా ఉన్నాయి, భారతంలో. ఒక ఉదాహరణకి, శకుంతలోపాఖ్యానం చూడండి. అయితే మక్కీకి మక్కీ గా అప్ప చెప్పలేదు. ఏది ఏమయితేనేం? నాకు తెలిసినంతలో, భారతంలో ఇల్లా మక్కీకి మక్కీ రిపీట్ అయిన పద్యం లేదనే అనుకుంటున్నా. ఇది పరిశోధించవలసిన విషయమే.

నేను “రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదా? అమెరికా వచ్చినా ఐరిష్ స్ట్యూ తింటానికి లేదా? ఇండియాలో పుట్టినందుకు, అక్కడి నుండి వచ్చినందుకు బూడిద పూసుకొని గాలి భోంచెయ్యాలని అనుకుంటున్నారో? అమెరికా నుండి అమర లోకం వెళ్ళినా ఈ మతం నుండి నాకు విముక్తి లేదో. ముక్తి రాదో” అని మరొక్క సారి మండిపడ్డాను.

“ఈ కేసులన్నీ మన ఒళ్ళో వచ్చి పడతాయేంట్రా” జడ్జీ ముకుంద రావు తన చిన్న నాటి స్నేహితుడు లాయర్ వెంకట్ రెడ్డితో నిరాసక్తంగా అన్నాడు.
అది అగస్టు నెల, ఆదివారం. రాత్రి తొమ్మిది అయింది, అప్పుడే తెలుగు టీవీ లో వార్తలు అయిపోయి ఏదో మళ్ళీ సినిమా మొదలయింది. ఇద్దరూ కలిసి ఒక బీరు బాటిలు ఖాళీ చేసారు అప్పటికి.

సిమెంట్ రంగుల హొరైజన్ లోంచి సిమెంటు వంతెనల్ని సిమెంటు మబ్బుల్నీ చీల్చుకుంటూ సిమెంట్ రంగు రైలే చడీ చప్పుడూ లేకుండా వచ్చి ఆగింది. ఆగి రైలు మాట్లాడుతుంది. “Easley North! Doors Opening! Easley North!! Doors Opening!!” అని తనకి ఇష్టమైన తియ్యని స్వరంతో.