ఇంతలో ఉన్నట్టుండి కుక్క శరీరం బిగుసుకుంది. కదలకుండా ఊపిరి బిగబట్టి నేలలో వున్న నెర్రె వైపే చూస్తూన్న దాని శరీరంలో వెంట్రుకలన్నీ అదో మాదిరి ఉద్వేగంతో నిక్కబొడుచుకున్నాయి. ఆమెకి అర్థం అయింది. వంటింటి గోడ కింద వున్న నెర్రె వైపే తనూ చూస్తూ చేతి కర్ర అందుకుందామె. చిన్న కంతలోంచి గాజు గోళీల్లాంటి రెండు చిన్న కళ్ళు కదలకుండా బయటికి చూస్తున్నాయి. ఆమె ఇంకా మెల్లిగా చేతి కర్ర పైకెత్తింది.

వద్దు. పాప జాగ్రత్త. పాపకేమన్నా కావాలంటే చేసి పెట్టు. కానీ, మనసేదోలా ఉంది. ఏవో పాత సంగతులు చుట్టూ తిరుగుతోంది మనసు. బంగారం మొత్తం అమ్మేయడం, ఆ సంగతి మామగారింట్లో తెలియడం, వాళ్ళ ముందు తలవంపులు, బిడ్డకు టాబ్ కొనివ్వలేక అబద్ధం చెప్పడం, ఖాళీ అయిన కొట్టు పరిస్థితి, పరువు పోయిన సందర్భం- వీటన్నింటి ముందూ గుర్తొచ్చే బంగారు పతకం, మార్కుల షీటు, సాహిత్య సంపద తెచ్చిన బహుమానం, పాఠాలు విన్న పిల్లలు అప్పుడప్పుడూ చేసే నమస్కారాలు, మనసంతా బరువెక్కింది.

ఏం వాగుతున్నావురా? దేవుడంటే అనంతం కదా? అలా మెళ్ళో వేలాడదీసుకుని ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోయేవాడు దేవుడెలా ఔతాడు? ఒళ్ళు కొవ్వెక్కి నిజానిజాలు తెలియక మాట్లాడుతున్నావు కాబోలు. విను, దేవుడంటే మా బ్రహ్మ ఒక్కడే. ఆయనే ఈ సృష్టి అంతట్నీ సృజించి లయం చేస్తూ ఉంటాడు. ఆయన్ని గుర్తుంచుకోవడానికి అనేకానేక గుళ్ళూ, గోపురాలు కట్టాం. ఓ సారి గంగాతీరం పోయి చూసిరా.

ఆ రోజు రాత్రి తీర్థయ్యకు మళ్ళీ అదే కల వచ్చింది. చౌరంగీ రస్తాకు రెండువైపులా లక్షల సంఖ్యలో జనం నిలబడి ఉన్నట్టూ, వాళ్ళంతా రాతివిగ్రహాలై నిశ్చలంగా నిలబడినట్టూ, దారికి రెండువైపులా పెద్దపెద్ద తెల్లటి నియాన్ దీపాలు వెలుగుతున్నట్టూ! ఆ దారంతా రక్తం! అక్కడ నిలబడి ఒక నడివయస్సు స్త్రీ ఛాతీని రెండు చేతులతో బాదుకుంటూ, ప్రవీర్! ప్రవీర్! అంటూ విలపిస్తోంది. ఆమె విరగబోసుకున్న పొడుగాటి జుట్టు ముఖం మీద పడుతోంది.

“సుందరం మా బంధువుల కుర్రాడే. తెల్లగా, సన్నగా ఉండేవాడు. నువ్వూ చూశావు. ఓసారి అతనికి పెద్ద యాక్సిడెంట్ అయి ట్రీట్‌మెంట్‌కి బాగా డబ్బు ఖర్చయింది. మా మావగారు అత్తగారివి నావి నగలు, మా ఇల్లు తనఖా పెట్టి ఆ కుర్రాడికి చికిత్స చేయించారు. దేవుడి దయ. ఆ అబ్బాయి కోలుకున్నాడు. తర్వాత బార్క్‌లో సైంటిస్ట్ అయ్యాడు. మేమంటే ఆ కుర్రాడికి బాగా అభిమానం.” అని చెప్పి, “మూర్తి వాళ్ళు మన కాంపౌండ్‌లోనే ఉండేవాళ్ళు గుర్తులేదా?” అని అడిగింది పరిమళ.

అంతకుముందు ఎప్పుడైనా చర్చ్‌కి వెళ్ళడానికి ఆసక్తి ఉండేది. ఇప్పుడు పొద్దున్నే లేవడానికీ, తిండి తినడానికీ కూడా వెగటే. దేవుడి గురించి విన్నదీ కన్నదీ అంతా కట్టుకధే అనే అనుమానం మొదలైంది. దేవుడనే వాడుంటే ఇలా చేస్తాడా? వయసైపోతున్న తనని వదిలేసి చిన్నకుర్రాణ్ణి తీసుకెళ్ళిపోయేడు. చర్చ్‌లో ప్రతీవారం పాస్టర్ భగవంతుడికి అపారమైన కరుణ ఉందని అంటాడే! మరి కళ్లముందటే ఇలాంటివి జరుగుతూంటే ఎలా నమ్మడం?

అప్పా ఒక్కసారి నిశ్చేష్టుడయ్యాడు. మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి తేరుకొని మాటల యుద్ధం మొదలు పెట్టాడు. మాస్టారు ఏమాత్రం కనికరం చూపించలేదు. “నావల్ల కాదు,” అంటూ వంద సార్లు అన్నాడు. చివరకి అప్పాకి విసుగొచ్చింది. మాస్టారి నిగ్రహం చూసి ముద్దు పెట్టుకోబోయాడు. కావాలంటే తన కొడుకు బదులు తనే పరీక్ష తీసుకుంటానన్నాడు. బూతు జోకులు చెప్పాడు. మరీ దిగజారుడుగా మాట్లాడ్డం మొదలు పెట్టాడు.

అందరూ వెళ్ళిపోయాక ఒక్కడే మిగిలాడు. ఒక్కడే! వెళ్ళినవాళ్ళు వచ్చేవరకూ ఏం నమ్మకం? వాళ్ళొస్తే లక్ష్మి ఇక్కడే ఎక్కడో ఉందని, ఉంటుందని అనిపిస్తుంది. బయటో, లోపలో ఉండే ఉంటుంది. కళ్ళు దించుకొని మెల్లమెల్లగా అడుగులు వేస్తూ వచ్చి ఎదుట నించుంటుంది. వచ్చి నిలబడకపోతే మానె. అసలు లక్ష్మిని మళ్ళీ ఎవరు తీసుకు రాగలరు? ఎవరు తిరిగి వచ్చారు ఇంతవరకూ? ఎవరైనా తీసుకొని రాలేరు. అసలిప్పుడు వాళ్ళకు అమ్మ ఎందుకు? వాళ్ళు పెళ్ళాల సొంతమైపోయారు.

“పాపమా? ఎవడండీ చెప్పేడు? మనిషి జీవితాన్ని సుఖమయం చేసుకోమనే బుర్ర నిచ్చేడు మనకి సృష్టికర్త. ఆ బుర్ర ఉపయోగించి గింజలు ఉడకబెట్టుకు తినొచ్చు, పిండిచేసుకుని రొట్టె చేసుకోవచ్చు, లేకపోతే పానీయాలు చేసుకోవచ్చు. పక్కింటాయనకి ఓ బస్తా ఇవ్వగా లేంది మీ ఆనందం కోసం ఓ బస్తా గింజలు విదల్చలేరూ? అదీ మీరు తాగబోయే పానకం కోసమే కదా?” పగలబడి నవ్వేడు నికోలాస్.

“నేనొచ్చిన సంగతి తెలిసి అమ్మ ఒక్క గెంతుతో కిందకి దిగింది. అందరూ నన్ను ముట్టుకోడానికి పోటీలు పడ్డారు. దెయ్యాన్ని కాదని నిశ్చయించుకోడానికి కాబోలు! నా మీద పడి అంతా ముద్దులు కురిపించేసరికి ఊపిరాడలేదంటే నమ్ము! అది సరే కానీ, ఈ కుక్క పిల్లకెంత దాహమో చూడు! అసలు దీంతో పాటు ఒక నీళ్ళ టాంకరు తెచ్చుకోవాల్సింది మనం. ఈ ఎండలకిది ఇద్దరు మనుషుల నీళ్ళు తాగుతుంది.”

మరణ శిక్ష అంటే ఎవరో ఒకరు కత్తితో నేరస్తుణ్ణి నరకాలి. లేకపోతే ఉరి తీయాలి. అయితే ఎప్పట్నుంచో మొనాకోలో అసలు హత్యలూ నేరాలు లేవు కనక ఉరితీసే తలారీ ఎక్కడా లేడు దేశంలో. జూద గృహాల్ని మాత్రమే చూడ్డం అలవాటైపోయిన సైన్యంలో ఏ ఒక్కడూ దీన్ని తలకెత్తుకోవడానికి ముందుకి రాలేదు. నేరస్తుణ్ణి వదిలేస్తే దీన్ని చూసుకుని మరో హత్యా కలహాలు మొదలౌతాయ్. సరే తలారిని వెదికే లోపుల వీణ్ణి జైల్లో ఉంచుదాం అని తీర్మానం అయింది. మరి జైలే లేదు మొనాకోలో.

“దేవుడి ప్రమాణంగా నాకేమీ తెలియదు, నేను కాదు హత్య చేసింది” అని చెప్పేడు ఆక్సినోవ్ కానీ గొంతుకలోంచి మాట రావడం కష్టమౌతోంది, ఎప్పుడూ చూడని కష్టం ఎదురయ్యేసరికి. పోలీసులకు నమ్మబుద్ధి వేయలేదు ఈ సమాధానాలన్నీ. పెడరెక్కలు విరిచి కట్టి తీసుకెళ్ళిదగ్గిర్లో ఉన్న జైల్లో పెట్టేరు. మొత్తానికి తోటి ప్రయాణీకుణ్ణి హత్య చేసినందుకూ, అతని దగ్గిర్నుంచి ఇరవైవేల రూబుళ్ళు కొట్టేసినందుకూ పోలీసులు ఆక్సినోవ్ మీద కేసు తెచ్చారు.

అప్పుడు తలుపు తట్టింది అదృష్టం. అక్కడున్న వాళ్ళు మనిషికొక పాతిక ఎకరాలు ఇస్తారుట, కుటుంబానికి పాతిక కాదు. పాహోం ఎగిరి గంతేసేడు. అలా పాహోంకి వచ్చింది నూట పాతిక ఎకరాలు! తనకి మునుపున్న ఇరవై ఎకరాలు ఇప్పుడు చిన్న నాటుమడి కింద లెక్క! అన్నీ వదులుకుని వచ్చినవాడికి నూట పాతిక ఎకరాలు ఉత్తినే వస్తూంటే చేదా? అవి ముక్కలైతేనేం? పాహోం మళ్ళీ వ్యవసాయం మొదలు పెట్టేడు. వోల్గా నది నీళ్ళో మరేమో కానీ పాహోం పట్టిందల్లా బంగారమైంది పొలాల్లో.

“మీరు జ్ఞాన సంపన్నులని ఊళ్ళో వాళ్ళు చెప్తూంటే విని నాకున్న మూడు సందేహాలు మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. ఏ పని చేయడానికైనా సరైన సమయం ఏదో తెలుసుకోవడం ఎలా? నాకు కావాల్సిన ముఖ్యమైన మనుషులెవరో గుర్తించడం ఎలా? నాకున్న పనుల్లో అతి ముఖ్యమైన పని ఏది? ఇవే నా ప్రశ్నలు. వీటిని ఎంతమందినో అడిగాను కానీ ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయేరు. కొంతమంది చెప్పినా అవి నాకు నచ్చలేదు.”

ఎక్కడా ఆగకుండా సూర్యుడు పైకొచ్చేదాకా నడిచాక ఏలీషా ఒక చెట్టు కింద కూర్చుని సంచీ బయటకి తీసేడు. ఉన్న డబ్బులు లెక్కపెడితే పదిహేడు రూబుళ్ళ ఇరవై కొపెక్కులు మిగిలాయి. కూర్చున్న చోటునుంచి ఒకవైపు, జీవితాంతం వెళ్దామనుకున్న జెరూసలం రా రమ్మని పిలుస్తోంది. ఏలీషా ఆలోచనలు పరివిధాలా పోయేయి. చేతిలో డబ్బులు చూస్తే వీటితో జెరూసలం వరకూ వెళ్లగలడం అసంభవం.

సాములూ సాములూ
గవర్మింట్టు సాములూ
సాలెగూడు తెంపేదానికి
చీటీ తీసుకొచ్చినేరా?
చీమని నలిపేదానికి
జీపెక్కొచ్చినేరా?
ఆరుగెజాలిల్లు కూలగొట్టను
ఆర్డరు తీసుకొచ్చినేరా?

సరంగు ఈ లంకలో ఆగడం ఎంత ప్రమాదమో, ఎందుకు వద్దో అన్నీ పాస్టర్‌కి చెప్పి ఆయన్ని అక్కడకి వెళ్ళకుండా ఆపుదామని చూశాడు కాని పాస్టర్ మంకుపట్టూ, ఆయన పాస్టర్ అనే గౌరవం వల్లా ఏదీ కుదర్లేదు. ఓ అరగంటలో చకచకా పడవ దింపడం, పాస్టర్ గారూ ఇంకో ఇద్దరు పడవ నడిపే బెస్తవాళ్ళూ దిగడం అయింది.