టేబుల్ మీదున్న రెండు పుస్తకాలు ప్రస్తుతం చదువుతున్నవి. ఒకటి మెక్సికన్ రచయిత నెట్టల్‌ది. వాళ్ల కథల్లో అఫైర్స్ మనం కొత్త బట్టలు కొంటున్నప్పుడు వేసే ట్రయల్స్ అంత సునాయాసంగా ఉంటాయి. ఒక జంకుండదు. బొంకుండదు. ఇంకోటి ఇస్మత్ చుగ్తాయ్ కథల పుస్తకం. ఆమె అప్పట్లోనే అన్ని ఎలా రాసిందో, అన్ని రాసినా ఆ విషయాలు మామూలైపోకుండా ఎందుకున్నాయో నాకు అర్థం కాని విషయం.

జీవితం ఒడ్డుకి చేరి అక్కడే నిలబడిపోయాడు. “కదులు కదులు!” మబ్బులు గర్జిస్తూ చెప్పాయి. “పద పద!” చినుకులు కురుస్తూ తట్టాయి. “రా రా!” పిట్టలు పాడుతూ పిలిచాయి. “మరిచిపో మరిచిపో!” ఆకులు రాలుతూ అన్నాయి. కదలని మరవని అతనికి అవసానదశలో ఒకటే ప్రశ్న. దాన్ని మోసుకుంటూ ఎక్కడెక్కడో వెతకగా చివరికి కలిసింది. ఆమె గుర్తు పట్టాక అడిగాడు “నేను పరీక్షలో నెగ్గానా?”

ఆ మాటలు విన్న విక్రమార్కుడికి, బేతాళుడికి సమకాలీన రాజకీయాలపై కూడా మంచి అవగాహన ఉందనిపించింది. లేకపోతే ఈ స్థాయిలో వ్యంగ్యవ్యాఖ్యలు ఎలా విసరగలడు? పొగడ్తల సంగతి తర్వాత. తనముందు ఉన్న అగడ్త దాటటం ఎలా? చూపును రహదారి మీదనే కేంద్రీకరించి కాసేపు ఆలోచించాడు.

నిసికి గుర్తు ఉన్న ఒక విశేషం ఏమంటే, ఆంటీగారు గైనకాలజిస్ట్ అయివుండి, ఒక ప్రముఖ హాస్పిటల్ ప్రసిడెంట్‌గా ఉండి, ఆ సమావేశానికిగాని, అందునా బ్రస్ట్ కేన్సర్ మీద తన ప్రజెంటేషన్ వింటానికిగాని రాకపోవటం, అమ్మ ఆ సమయంలో ఆంటీగారింటికి వెళ్లి, ఆవిడకిష్టమని కోడిగుడ్ల పులుసు, బంగాళాదుంపల వేపుడు చేసిపెట్టటం. అందువల్ల ఆంటీగారిని ఆఖరుసారి ఎప్పుడు చూడలేదో నిసికి గుర్తుంది.

కొందరు సెల్‌ఫోన్‌లు పోగొట్టుకుంటారు, తర్వాత వెతికి పట్టుకుంటారు. కొందరు పెన్ను పోగొట్టుకుంటారు, వెతుక్కుంటారు. కొందరు తాళంచెవి. కొందరు ఇంకేవో. నేను ఒకసారి నా కారుని పోగొట్టుకున్నాను. ఆ రోజు టొరాంటోలో మంచు ఎక్కువగా కురుస్తుందనీ, వాతావరణం తల్లకిందలవుతుందనీ ఎఫ్.ఎమ్. రేడియోలో అనౌన్స్‌మెంట్ వస్తూనే ఉంది. నేను తొందరగా హాస్పిటల్‌కి చేరుకున్నాను.

జేరిన కొత్తలో జగదీష్ సింగ్ కేసి చూసి, ఓ అస్సాం కుర్రాడు, మనీష్ అనే అతను సింగ్ ఎత్తు ఎంతో అడిగి పేంట్ కేసి చూపిస్తూ, ‘సైజు ముఖ్యం తమ్ముడూ, ఇది ఇండియన్ ఆర్మీ,’ అన్నాడని బాగా ప్రచారం అయింది ఆ రోజుల్లో. మనీష్ అలా అన్నందుకు సింగ్ నొచ్చుకున్నా తర్వాత స్పోర్టివ్‌గా తీసుకుని మర్చిపోయాడని చెప్పుకున్నారు.

తల నిమిరే కొద్దీ ఆమె కన్నీళ్లు ఎక్కువయ్యాయి. అతడు ఆమెకు దగ్గరగా జరిగాడు. కాలిపై కాలు వేసి హత్తుకున్నాడు. ఆమె అతన్ని దగ్గరగా తీసుకుంటూ వెనక్కి వాలింది. మీదకు వంగి ముద్దుపెట్టుకున్నాడు, ఆమెను చుట్టిన చేతితో తల నిమురుతూనే. ఆమె భుజంలో తలను దాచుకున్నాడు. ఆమెకి అర్థమయ్యింది. సుతారంగా వీపుని నిమిరింది. కొన్ని నిమిషాల తర్వాత, భుజం పైకి ఎత్తింది ఆమె, అతడిని కదిలించడానికి.

రాజా! నువ్వు నన్నెందుకు తీసుకువెళ్తున్నదీ నాకు తెలుసని నీకూ తెలుసు. పాత తెలుగు జానపదచిత్రాలు నువ్వు చాలానే చూసి ఉంటావు. వాటిల్లో కథానాయకుడు, కథానాయికని రక్షించటానికి మారువేషం వేసుకుని వస్తాడు. వచ్చింది కథానాయకుడని, కథానాయికని రక్షించటానికి అలా వచ్చాడని ప్రతి ప్రేక్షకుడికీ తెలుస్తుంది. కాని, ప్రతినాయకుడికి మాత్రం తెలీదు. కొంప తీయకుండా నేను, అలాంటి ప్రతినాయకుడ్ని అనుకుంటున్నావేమో నువ్వు. కానే కాదు.

ఈ గదిలో చేరిన రెండేళ్ళకి మొదటిసారి పైకొచ్చింది. ఒక పెళ్ళీడు కొచ్చిన అమ్మాయి, వయసుకు సంబంధించిన ఆవేశమేమీ లేకుండా చాలా సూటిగా తొణక్కుండా మాట్లాడింది. చాలా స్పష్టతతో గూడా. అపుడపుడూ పలకరింతనవ్వులూ పరిచయవాక్యాలూ తప్ప మేమెప్పుడూ పెద్దగా మాట్లాడుకోలేదు. తన పని తాను చేసుకుపోయే మంచి పిల్ల. ఏం చేయాలిపుడు?

ఈ మనుషులకి శవపేటికమీద ఉంచిన తాటాకుకు అర్థమే తెలియదనుకోవాలా? అది వారికేమీ కాదని అనుకుంటున్నారా? చనిపోయిన వ్యక్తి తన ఊరికోసం తిరిగివచ్చాడని వీళ్ళకెవరికీ తెలియడం లేదా? హార్వీ మెరిక్ పేరుతో జతకలిసి ఉండకపోతే ఈ ఊరి పేరు ఎవరికి తెలిసేది? ఈ ఊరు శాశ్వతంగా ఏ పోస్టల్ గైడులోనో సమాధి అయిపోయి ఉండేది.

మధ్యలో కనపడని మంచుగోడగా గడ్డకడుతూ గాలి. నేపథ్య సంగీతమెప్పుడు ఆగిపోయిందో తెలియదు. తొందరగా ముగిసిపోయిన ఒక ఆట. ఉద్విగ్నక్షణాలూ విరబూసిన రంగులూ జారిపోయిన, కరిగిపోయిన అనంతరం ఖాళీగా మిగిలిన సినిమా హాల్లా. ఇష్టంగా తినీ, తాగీ అక్కడక్కడా ఇప్పుడు చెత్తగా ఒదిలేసిన కొన్ని పట్టించుకోని జ్ఞాపకాలూ.

కొంతకాలంగా ఆహవి తల్లితో సుముఖంగా మాట్లాడటంలేదు. ఏమి చెప్పినా దానికి బదులు మాట్లాడుతుంది. ఏమడిగినా వంకర సమాధానాలు చెప్తుంది. ఎవరైనా పెద్దవాళ్ళు ‘ఎలా ఉన్నావు?’ అనడిగితే ‘దిట్టంగా ఉన్నాను!’ అంటోంది. ‘తిన్నావా?’ అని ప్రశ్నిస్తే అవుననో లేదనో అంటే సరిపోతుంది. అయితే ఈ పిల్ల పళ్ళు ఇకిలించుకుంటూ ఏం మాట్లాడకుండా నిల్చుంటుంది.

రాజా! పచ్చిగా చెప్పాలంటే ఈ పాఠకరావు ప్రవర్తన నాకెందుకో పిచ్చిగా కనపడింది. పత్రికలో ఉన్న కథల పేర్లు చూసినప్పుడు అతడి మొహం తీగపై ఒక నవ్వుపువ్వు ఎందుకు పూచింది? చిటికె వేసిన మరుక్షణంలోనే అతడి కనుబొమలెందుకలా వింటి రూపం ధరించాయి? తన ఇంటి పైకప్పు ఎలా ఉంటుందో అతడికి తెలియదా? దాని వంక ఎందుకు అతడలా చూశాడు?

జోగినాధం నెమ్మదిగా లేచి కూజా దగ్గరికి వెళ్లి నీళ్ళు గ్లాసులోకి వంచుకున్నాడు. చేతితో గ్లాసు పైకెత్తి పట్టుకుని ఒక్క క్షణం చూసి తర్వాత గడగడ త్రాగాడు. అది గమనించి శర్మ అనే మరో గుమాస్తా నవ్వి, “మన కూజాలో నీళ్ళన్నీ ఒక్క జోగినాధంగారే కాజేస్తున్నారండీ… అదేమి చిత్రమో ప్రతి అరగంటకూ ఆయనకు దాహమవుతూ ఉంటుంది” అన్నాడు.

చామనచాయలో వుండే ఆయన కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా వుంటాయి. ఆ ఎరుపు కనపడకుండా నల్లకళ్ళద్దాలు కాపు కాస్తూ వుంటాయి. ఆయన పెదాలు మాడిన కెంపు రంగులో వుంటాయి. వాటిని పొగలుగక్కే సిగరెట్లు దాచి పెడుతుంటాయి. ఆయన వంటి మీద లాల్చీ షరాయిలు ఎప్పుడూ లేత మొగలి రేకుల్లా తళతళమంటుంటాయి.

కొవ్వొత్తి, అగ్గిపెట్టె తెచ్చినతను నోటికి చెయ్యడ్డం పెట్టుకుని ముందుకు కదిలే ధైర్యం తనకు లేదన్నట్లు అడ్డంగా తలూపుతూ ఉన్నచోటనే కుప్పకూలిపోయాడు. మిగిలిన ఇద్దరూ పలాయనమంత్రం పఠించటానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా, వాళ్లు; వాళ్ల రాకడతోనే వాళ్ల వెనకే యాంత్రికంగా మూసుకుపోయిన గుమ్మం తలుపుల్తో యుద్ధం చేస్తున్నారు.

భూమి నిద్రపోదు అంటారు. అయితే ఆకాశం మేలుకునుండదు. రాత్రివేళల్లో మేలుకుని పనిచెయ్యాల్సి వచ్చినప్పుడు చాలా మనోహరంగా ఉంటుంది. దీపాలన్నీ ఆర్పేసి చీకటి మధ్యలో నిశబ్దంగా కూర్చుని చూసేప్పుడు నక్షత్రాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది. వర్షాకాలంలో మెరుపులూ, ఉరుముల శబ్దమూ ఆశ్చర్యంగా కిందనుండి పైకొస్తున్నట్టుగా ఉంటుంది.

ఎక్కడ్నుంచి మొదలెట్టాలో తెలియలేదు. బహుశా ముందు పెద్దవి. ఆమే అంది “వాషింగ్ మెషీన్ నేను తీసుకుంటాను. ఫ్రిజ్ నువ్వు తీసుకుంటావా?” “సరే.” వాటికి రెండు రంగుల స్టిక్కర్స్ అంటిస్తూంది గుర్తుగా. పద్ధతిగా అనుకున్నట్టు జరగాలామెకు. బెడ్స్, సోఫా, టేబుల్స్, టీవీ, వాటి మీద పేరుకున్న ఉదయాలు, సాయంత్రాలు, రాత్రులు, మాటలు, నవ్వులు, భోజనాలు, తిట్లు. ఆ జ్ఞాపకాల బరువుకు అన్నీ కుంగిపోతున్నట్టు ఉంది.

వీళ్ళు, ఆ పెద్ద చిత్రకారులు, ఇలా మహా ముచ్చటగా ఉంటారు. చంద్రగాడు, బాలిగాడు, మోహన్‌గాడు అనుకుంటూ. ఎదురుపడగానే ‘ఒరేయ్ అరేయ్ తురెయ్’ అనుకుంటూ. నాకది ఎప్పటికీ చేతకాదు. బహు మర్యాదగా నేను బాపుగారి బ్యాచ్. ఎంతటి గారి నయినా ఎదురుగా సార్ అనే అంటాను, వాడు వెనక్కి తిరగ్గానే ‘జారే నీయఖ్ఖ బోస్ డికె’ అనడమే కద్దు.