రెండు రోజుల సమావేశాలు సాహిత్యపరంగా చాలా ఆసక్తికరంగా జరిగాయి. దీనికి డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్బు ఎంతో కష్టపడి విజయవంతం చేశారు. పాత మిత్రులను కలవడానికి, కొత్తవారితో పరిచయం చేసికొనడానికి అవకాశం దొరికింది.

తెలుగులో శాస్త్రవిజ్ఞాన పుస్తకాల అవసరం ఇంకా ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి చేసిన ప్రయత్నమే రోహిణీప్రసాద్ గారు అంతరిక్షాన్ని గురించి రాసిన “విశ్వాంతరాళం” పుస్తకం.

కవి ఊహలకు, ఆ ఊహలకు ఊపిరి పోసేందుకు ఎంచుకున్న వర్ణాలను, చిత్రించడానికి ఎన్నుకున్న కుంచెలను చూసేక ఇది ఈ కవయిత్రి మొదటి కవితా సంకలనం అంటే ఆశ్చర్యమేసింది.

ఈ సమావేశంలో కవులు, కథా, నవలా రచయితలు, విమర్శకులే కాక సాహిత్యాభిమానులు ఎందరో పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ-మెయిలు ద్వారా, రచ్చబండ ద్వారా పరిచితులైన ఎందరో మిత్రులను కలుసుకొని మాట్లాడే భాగ్యం కలిగింది.

అనువాద రచనలు మూల భాష తెలిసిన వారిని,అనువాద భాష మాత్రమే తెలిసిన వారిని సమానంగా రంజింపజెయ్యాలని ఎలా ఆశిస్తామో, అలాగే అనుభవాల గురించి రాసిన రచనలు కూడా ఆ అనుభవాల నెరిగిన వాళ్ళకి, ఎరగని వాళ్ళకి కూడా సంతృప్తి నియ్యాలని ఆశించటంలో తప్పులేదు.

ఐతే, ఈ వర్ణనలో ఎక్కడా పర్యాటక దృష్టి కనబరచకుండా, కవి తనకై కలిగిన అనుభూతిని, ఆలోచనని, తన్మయత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసారు.

“సరస్వతీ దేవికి సంగీతం, సాహిత్యం రెండు కళ్ళు” అన్న నానుడి ననుసరించినట్లుగా ఈ సాహితీ సదస్సు శ్రీమతి సీత నిష్టల వీణా వాదన ప్రార్థనా గీతంతో ప్రారంభించబడింది.

ఈ నేపథ్యంలో కొల్లూరి సోమశంకర్ వంటి సమర్ధుడైన యువరచయిత ఇతర భాషల కథల్ని తెలుగులోకి తర్జుమా చెయ్యటం మీద తన దృష్టి కేంద్రీకరించడం అభినందించాల్సినదే. ఐతే ఉత్తినే దృష్టి కేంద్రీకరిస్తే ఏమైంది? ఇప్పటివరకూ 40కి పైన కథల్ని చక్కటి తెలుగులోకి అనువదించి వివిధ పత్రికల్లో ప్రకటించటమూ, వాటిల్లోంచి 19 కథల్ని ఏరి “మనీప్లాంట్” అని చిన్న సంపుటం వెలువరించటం – అదీ నిజంగా అభినందించాల్సిన విషయం.

నారాయణరావు గారి అనువాదం కన్యాశుల్కం నాటకాన్ని మళ్ళీ చదివించింది. అనువాదమే కాదు; ఆయన రాసిన వెనుక మాట (The Play in Context) నూతన ప్రేరణనిచ్చి, తిరిగి ఆలోచించవలసిన అవసరం కల్పించింది. వెనుక మాటలో నారాయణరావుగారు ఒక సరికొత్త ప్రతిపాదన చేసారు. ఒక రకంగా ఇది విప్లవాత్మకమైన ప్రతిపాదన. తన ప్రతిపాదనని సోపపత్తికంగా సమర్థించారు.

కన్యాశుల్కం నాటకం పై గత 50 సంవత్సరాలుగా వచ్చిన పొగడ్తలు, విమర్శలు, ప్రతివిమర్శలు నుండి పాఠకులకు పనికివచ్చే కొటేషన్లు పొందుపరచడం కోసం ఈ అనుబంధంలో నేను సాధ్యమైనంతవరకు మూల వ్యాసాలను చూడటానికి ప్రయత్నించాను.

వానా కాలమే కాదు, వాన పడిన సమయం కూడా కవులకు ముఖ్యమౌతుంది. చంద్ర కవితలను విడివిడిగా అనేక సంవత్సరాలుగా చూస్తూనేఉన్నా, అన్నిటినీ కలిపి ఒకచోట చదవటం మంచి అనుభవం.

అమ్మాయిలకు ఉన్నతవిద్య అవసరమా! ఏ వయసులో పెళ్ళిజరిగితే బాగుంటుంది? ఆర్థిక స్వాతంత్ర్యం స్త్రీలకెంత వరకూ ప్రయోజనకరం? ఆశయాలకూ, ఆచరణకూ పొంతన కనిపిస్తుందా? జీవితంలో సర్దుబాటు తప్పదా? అయితే, అది ఎలాంటి సర్దుబాటైతే బాగుంటుంది? సర్దుబాటు స్త్రీ, పురుషుల్లో ఇద్దరికీ ఉండాలా? లేక ఒక్కరికే ఉండాలా? మొదలైన ప్రశ్నలు – వాటికి సమాధానాలు డి. కామేశ్వరి గారు రాసిన ‘ మనసున మనసై ‘ నవలలో చాలా వరకు కనిపిస్తాయి. ఆ సమస్యలను నవల లోతుగా చర్చిస్తుంది.

పోగొట్టుకొన్నవాడి పాట [“సందుక” లోని మరికొన్ని కవితలు రచయిత వెబ్ సైట్ లో చదవగలరు. -సంపాదకులు] శిఖామణి మొదటి పుస్తకం “మువ్వల చేతికర్ర” లో […]

రచయిత వెలిబుచ్చిన అభిప్రాయాలలో చాల వాటితో నేను ఏకిభవిస్తాను. ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు తమ తమ మాతృ భాషలలో కాకుండా క్రమానుగతంగా అరబ్బీ, లేటిన్‌, సంస్కృతాలలో ప్రార్ధనలు చెయ్యటం ఎందుకు? దేవుడికి ఆ మూడు భాషలలోనే అర్ధం అవుతుందా? అని ధ్వనిస్తూ ప్రశ్నించేరు రచయిత.

“ప్రతి శిశు జననం మానవ జాతి మీద భగవంతునికి మిగిలి ఉన్న నమ్మకాన్ని నిరూపిస్తుంది” అన్నట్టే ప్రతి కవిజననం మన భాష మీద మనకున్న ఆశను రెట్టింపు చేస్తుంది.