విమర్శనము అంటే శబ్దార్థచంద్రిక ఇచ్చిన ఒక అర్థం పర్యాలోచనము. ఈ పదానికి అర్థం, చక్కగా ఆలోచించుట. వ్యాఖ్యలు రాసే విషయంలో; ఈమాట ఇచ్చిన సూచనల్లో అంతర్లీనంగా ఉన్న భావం, పాఠకులని చక్కగా ఆలోచించి వ్యాఖ్య రాయమనే. వ్యాఖ్య, ఒక రచనపై పాఠకుడి విమర్శ. విమర్శ అంటే ప్రతికూలస్పందన ఒక్కటే కాదు- సానుకూలస్పందన కూడా.

సాహిత్యాన్ని సీరియస్‍గా తీసుకునే చాలామందికి సాహిత్యానికీ జీవితానికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి తెలుసు. ఆ సంబంధం వ్యక్తిగతమే గాదు, సామాజికం అని కూడా లీలగా తెలుసు. ఈ విషయంలో అనేకానేకుల భావనలు స్పష్టాతిస్పష్టంగా ఉండే అవకాశం ఉంది. మరి, తెలుగు సాహిత్యంలో రాజ్యాంగనైతికత స్థానమేమిటి? అవసరమేమిటి?

అఫ్సర్ రాసిన ఇంటివైపు కవిత్వసంపుటి పుస్తకానికి వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ముందుమాట. ప్రచురణ వివరాలు: ఇంటివైపు – అఫ్సర్. వాకిలి ప్రచురణ, 2017. వెల: Rs. 180/- $ 9.95 ప్రతులకు: నవోదయ, అమజాన్, కినిగె, తెలుగుబుక్స్.ఇన్

కవి పదాల ఎంపిక కూడా స్పష్టమైనది. అందుకే, ‘గతాన్ని వెలిగించి గట్టిగా పీల్చాను’ అనడం ద్వారా, దిగులు పడడమనేది తనకొక వ్యసన ప్రవృత్తిగా మారిందని చెబుతున్నాడు. ఆ దుఃఖం వదిలించుకునే అవకాశం ఉండి ఉండవచ్చు గాక- దానినితడు వాడుకోలేడు. ప్రతిగా అతడేమి మూల్యం చెల్లించాల్సొస్తుందో కూడా తెలుసు.

పూడూరి రాజిరెడ్డితో కథల ప్రయాణం అద్భుతమైన అనుభవం. మనకు విసుగు తెలీకుండా కబుర్లు చెబుతూనే వుంటాడు. తన అనుభవాలు చెబుతూనే, అందులోనుండి గ్రహించిన జీవిత సత్యాలను, తాత్త్విక అవగాహనను మనతో పంచుకుంటాడు. సమయం చూసి మంచి పంచులు విసురుతుంటాడు. కిటికీ తెరచి అందులోనుండి ప్రకృతిని చూడమంటాడు.

వేశ్య అంటే వైశికీకళలో నిష్ణాతురాలైనట్టి స్త్రీ అని అర్థం. వైశికీకళ వాత్సాయన కామసూత్రాలలో వివరించబడిన ఒక ప్రత్యేక అంశం అంటూ రచయిత పేర్కొంటూ అదే పేరా చివరలో ‘ఇలాంటి ప్రత్యేకమైన శాస్త్రపరిజ్ఞానం ప్రాచీన కాలంలో వేశ్యలకు విశేషంగా ఉండడం వలన ఈ కళ వైశికీ కళగా ప్రసిద్ధి చెందింది’ అంటారు.

యాత్రల్లో పరాయివాళ్లు సొంతవారయిపోతారని, దూరం దగ్గరవుతుందని, మన మనసులు విశాలమవుతాయనీ తెలుసుకొన్నారట. 2009లో మొట్టమొదటిసారి విదేశీ ప్రయాణం చేస్తూ నేపాల్ వెళ్లినపుడు కొత్త మిత్రులతో, ఐయామ్ ఫ్రం ఇండియా! అని అంటూ వింత అనుభూతికి లోనయిన మనిషి కాస్తా 2016లో బ్రెజిల్ దేశంలో ఎవరో ‘ఇండియన్‌వా?’ అని అడిగినపుడు, ‘కాదు. గ్లోబియన్ని!’ అని చెప్పారట.

వృత్తిపరంగా ఇంజనీర్ ఐన రవిశంకర్, ఎంచుకున్న వస్తువుల్ని నిశితంగా పరిశీలించి వివిధ కవుల కవిత్వాల్ని (చాలావరకు) నిర్మొహమాటంగా నిర్మాణాత్మకంగా వివరించటానికి నిజాయితీ ప్రయత్నం చేశారీ వ్యాసాల్లో. ఏ వ్యాసానికి ఆ వ్యాసం చదవటం వేరు, అన్నిటిని ఒకేచోట చదవటం వేరు.

సుదర్శనంగారి సతీమణి, స్వయానా పేరుపొందిన రచయిత్రి వసుంధరాదేవిగారు శ్రమకోర్చి ప్రేమతో పూనుకొని ఉత్తరాలన్నీ పద్ధతిగా పోగు చేసి, తగిన వివరాలు పొందుపరిచి ప్రచురించారు. గతాన్ని తెలుసుకొని భవిష్యత్ నిర్మాణంలో పాలుపంచుకునే జిజ్ఞాసువులందరూ ఓపికగా ఒకటికి రెండు సార్లు తిరగేయవలసిన పుస్తకం.

ఈ పుస్తకం రాయటానికి రచయిత్రి పల్లవి ఏడు సంవత్సరాల కాలం వెచ్చించారట. కేవలం సమాచార సేకరణకు ఇంతకాలం పట్టలేదు. సుబ్బులక్ష్మి జీవిత విశేషాలన్నీ ఆకళించుకుని, ఆమెతో మానసికంగా చెలిమి చేసి… ఆపైన మాత్రమే రాయటం మొదలుపెట్టానంటారు రచయిత్రి. సజీవంగా లేని వ్యక్తి జీవిత గాథను పునర్నిర్మించటం అంత సులువైన పని కాదు.

స్త్రీపురుషుల సాంగత్యం అన్న ఒక్క అంశానికి సంబంధించిన అనేక సమస్యలు వేర్వేరు రూపాలతో, తీవ్రతలతో చుట్టుముడతాయి. ఇల్లూ వాకిలీ లేని వారి సమస్యలు చర్చల్లోంచి కూడా జారిపోయిన ఆధునిక యుగంలో కదా ఉన్నాం. పట్టపగలు, కనీసం పబ్లిక్ స్థలాల్లోనైనా స్త్రీ పురుషులు- సామాన్యులు- ఏకాంతంగా, స్వేచ్ఛగా, సన్నిహితంగా మసలడానికి సైతం వీలుకాని పరిస్థితుల వైపు, వారి మీద పెడుతున్న ఆంక్షల వైపు ఆలోచనలు మళ్ళుతాయి.

ఎంత యూరోపియన్ ప్రతీకలూ పాశ్చాత్య కవులూ తత్త్వవేత్తల ప్రభావం తన కవిత్వంలో కనిపించినా భద్రుడు ప్రధానంగా భారతీయ కవి. ఎందుకంటే ఉపనిషత్సుధాధారల్లోంచే భద్రుడి కవిత్వం జనించింది, తను పుట్టిపెరిగిన శరభవరమే కేంద్రంగా నిలిచింది, అక్కడి జనుల మాటల్నే గంగానమ్మ జాతర్ల పాటల్నే ప్రతిధ్వనించింది.

సౌభాగ్య కవిత్వం నేల విడిచి సాము చెయ్యదు. అతనిదంతా ఈ లోకపు కవిత్వం. అతను చూపించినదంతా ఇక్కడి సగటు మనిషి జీవితం. ప్రత్యేకించి, ప్రాంతీయతను పదిలపరుచుకున్న కవిత్వమితనిది. ఇతని ఊహలు, కవిత్వము కూడా ఒరిస్సా వాతావరణాన్ని దాటి వెళ్ళవు.

‘పాపని ఎప్పుడూ కోప్పడకూడదు. చాలా చాలా చాలా చాలా చాలా చాలా లడ్డూలు పెట్టాలి.’ అని ఉత్తుత్తి ఉత్తరంలో అమ్మమ్మ మాటగా తన మాటను చెప్పే గడుసుతనం ముచ్చట వేస్తుంది. అలాగే, బేబీ కార్న్‌తో పాటుగా మమ్మీ కార్న్, డాడీ కార్న్ ఉంటే ఫిజ్జు ఇల్లులో హాయిగా ఉంటారన్న ఆలోచన పిల్లలకు కాక ఎవరికి వస్తుంది?

శ్రీమతి వాలి ఉమాదేవి, వాలి హిరణ్మయీదేవి అనే పేరుతో 80వ దశకంలో విరివిగా కథలు వ్రాశారు. మంచి కథల రచయిత్రిగా పత్రికా పాఠకులకు చిరపరిచితులు. హిరణ్మయీదేవి గారు ఎప్పటినుంచో రాస్తున్నా, ఇటీవలి కాలంలో రాసిన 22 కథలతో స్వప్నసాకారం అనే వారి మొదటి సంపుటం లోని కథలకు ఒక సంక్షిప్త పరిచయం.

మనమున్న జీవితానికి, మనం గీసుకున్న పరిథి దాటి రావడమంటే యుద్ధంతో సమానమైపోయింది. గీతకి అవతలివైపు నుండి చేయి కనపడ్డప్పుడు, అది యుద్ధం నుండి బయటపడేసే సాయమేనేమో అనుకునే మనస్తత్వం దాదాపుగా మాయమై, అది సాయం కోసం చాచిన చేయేనని తీర్మానించుకుని, చూసీచూడనట్టు వెనుతిరగడం పరిపాటైపోయింది.

ప్రస్తుత సంకలనం ఇక్కడ నివాసిగా స్థిరపడ్డాక రూపొందినది. ఇందులో స్నేహరాహిత్యం పట్ల కొంత దిగులు ఉన్నా ఇక్కడ, ఇండియాలోనూ జరిగిన సమకాలీన సంఘటనలకి రాజకీయమైన స్పందన ఎక్కువ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా, ఇండియాలో తన ప్రాసంగికతను నిరూపించుకోవాలనే తాపత్రయం కవిలో ఉన్నట్టు నాకనిపించింది.

పల్లెటూళ్ళ జీవన చిత్రణలో ఒక సౌందర్యం ఉంటుంది. వర్గంగానో, సంఘంగానో కూడి బ్రతకడంలో దొరికే భరోసాని బలంగా చూపెడుతుందది. పట్టణజీవితపు ఒంటరితనంలో బిగ్గరగా చెప్పుకోలేని, ఒప్పుకోలేని, ఎవరితోనూ పంచుకోలేని, తప్పించుకోలేని వేదన ఉంటుంది. ఆశ్చర్యకరమైన ఈ వైరుధ్యాన్ని ఒకేసారి ఒకే కవితలో, లేదా ఒకే సంపుటిలో స్ఫుటంగా చెప్పడం మామూలు కవులకు దాదాపు అసాధ్యం. కరుణాకర్ మామూలు కవి కాదు.

సూచన ప్రాయంగా వెల్లడించిన భావాన్ని పట్టుకునే వాడు కవిత్వానికి సరయిన పాఠకుడు. సూచన ప్రాయంగా వెల్లడించడానికి తగిన భాషను విచక్షణతో సమకూర్చుకునే వాడు నిజమైన కవి. సౌభాగ్య కుమార మిశ్ర ఆ కోవకు చెందినవారు కాబట్టే అనువాదకుడి పని అంత సులువు కాదు. ఈ అరవై కవితల అనువాదానికి ఒక్క ఏడాది పట్టిందంటే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.

అమితాశ్చర్యం కొలిపే విషయం పిఠాపురం రాజావారు వారి పరివారంతో కాలిఫోర్నియాలో దిగ్గానే ఒక స్వామీజీ, వారి భక్తులు వీరికి స్వాగతం పల్కడం! ప్యాలస్ లని తలదన్నే ఒక ఇంట్లో (బెవర్లీ హిల్స్ లోని ఒక భక్తురాలి ఇల్లట) ఊదువత్తుల మధ్యలో సిల్కు దిండుల మీద ఆశీనులై ఉన్న ఈ స్వాముల వారిని అక్కడి వాళ్ళంతా ఒక దేవుడిని చూసినట్లు చూడటం!