ఊరి చివర వాడలో
ఒంటరిగా ఉంటాడు
డప్పు మోగమంటేనే
ఊరు లోకి వస్తాడు.
ఆదివారం దండోరా!
పాములోయ్ పహారా!

బుడిబుడి అడుగులేసే
నా పద్యాన్ని ఎత్తుకుని,
పాలుగారే బుగ్గల్ని చిదిమి
రెక్కల కింద చేతులేసి ఎన్నిసార్లు ఎగరేశానో!
ఎన్ని నవ్వుల్ని మూటగట్టుకున్నానో!

అధిక బరువు చేత నట్లైనదో యేమొ
హరితకలల గనుచు నడుగులిడిరొ!
ఉగ్రనీడల మతి దప్పి యుంటిరేమొ!
జనకొలువు జేర – జాగ్రత జారిపోయి
పాదబాటల బట్టిన పతనమబ్బు!

వేయాల్సిన వెర్రి వేషాలన్నీ అయిపోయాయి
ఇక మరణించాలనుకుంటా
ఎవడు మరణిస్తాడు పోదూ
నక్షత్రము మరణిస్తుందా
భూగోళం మరణిస్తుందా

తాళం వెనుక తాళం తీస్తూ పోతే
తలపులలా తెరుచుకుంటూనే
వుంటాయి.

శూన్యమైన గది మూలల్లోనూ
ముడుచుకున్న జ్ఞాపకాలు
మళ్ళీ తలలెత్తి చూస్తాయి.