ఏకవీర: విశ్వనాథ కథన కౌశలం అనే పుస్తకాన్ని డా. వై. కామేశ్వరి రచించగా, ముదిగొండ వీరభద్రయ్యగారి పీఠికతో, ఎమెస్కో వారు 2010 అక్టోబరులో అచ్చువేశారు. […]

అది ఆరవయ్యో దశకం. నేను టీనేజర్ని, పిల్ల విద్యార్థినాయకుణ్ణి ప్లస్ కార్యకర్తని. నేను కృష్ణశాస్త్రి కవితలకీ బొలీవియన్ జంగిల్ వార్‌కీ టెట్ అఫెన్సివ్‌కీ బాపూ చిత్తప్రసాద్ బొమ్మలకీ పుట్టిన బిడ్డని. బయాఫ్రాలో చనిపోయిన బిడ్డల ఏడుపు నుంచీ మా పేటలో జూట్ కార్మికుల మురికి బ్రతుకులనుంచీ జామిని రాయ్, లాత్రెక్, ఇల్యా రెపిన్ పెయింటింగ్‌ల నుండీ పుట్టాను.

కాని, ఈ దేశపు విద్యను ఆధునికీకరించడానికి అనుసరించవలసిన పద్ధతులు ఏమిటీ అనే విషయం మనం ఇప్పటికీ చర్చించలేదు. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా – మనకున్న పాత సంప్రదాయమంతా గొప్పదే, అంచేత గురుకులాల్ని మళ్ళీ పునరుద్ధరించాలని నేను కోరడం లేదు. మన విద్యల్ని ఆధునికీకరించడానికి మనకు నప్పే పద్ధతుల్ని అన్వేషించాలి. గుడ్డిగా అనుకరించనూ కూడదు. మనదంతా గొప్పదని పిచ్చిగా నమ్మనూ కూడదు. చివరిగా ఓ మాట చెప్పనివ్వండి – జ్ఞానానికి భౌగోళికమైన సరిహద్దులు లేవు. అజ్ఞానానికి మాత్రం వుంటాయి.

ఇజాలు రాసే వాళ్లంతా వాటిని పాటిస్తారని హామీ ఏదీ లేదు. నా వరకూ నేను మానవ ప్రవృత్తిని, స్వభావాన్ని పరిశీలించడాన్ని చిత్రించడాన్ని ఇష్టపడతాను. మనుషుల సహజ స్వభావం ఎలా ఉంటుందో కథల్లో యదాతథంగా చిత్రించడానికే నా ప్రాధాన్యం. నేను రాసింది కూడా అవే!

శేషయ్య శాస్త్రిగారు కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు. రాష్ట్ర ప్రభుత్వ హంస కళారత్న పురస్కారం, సంగీత కళా తపస్వి, గాన కళానిధి వంటి సన్మానాలను అందుకున్నారు. ఆయన హైదరాబాద్ శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు.

ఎవరైనా కొత్తపల్లి లోని కథలని ఎప్పుడైనా ఎక్కడైనా ముద్రించి ఎవరితోనైనా పంచుకోవచ్చు. హక్కులు అన్నీ పిల్లలవే. కథలకి బొమ్మలు వేయించి ఒక వేదికని ఏర్పరచడం, ఒక సమన్వయ కర్తగా వ్యవహరించడం మాత్రమే కొత్తపల్లి చేసే పని. కాపీరైట్ కాదిది; కాపీ లెఫ్ట్. అంటే అన్ని హక్కులూ సమూహానికే వదలబడ్డాయన్నమాట. ఓపెన్ సోర్స్ స్పిరిట్ అంటే ఇదే.

మనకు కావలసింది ఒక ప్రజాతంత్రమైన సాహితీ విమర్శ. ఆక్సిజన్ కొరవడిన సాహితీ సభల ఇరుకు గదుల నుంచి ఈ చర్చలను బయటకు తెచ్చి కాఫీ హౌసుల్లోను, కమ్యూనిటి హాళ్ళల్లోను, ఇంకా గ్రామాల్లోని కూడళ్ళల్లోకి పునఃపరిచయం చేయాలి. శతాబ్దాలుగా జగన్నాథ్ దాస్ రచించిన ఒడియా భాగవతం నలుగురు కూడే స్థానాల్లో చదవబడి చర్చించబడ్డది.

వలస పాలన సమయంలొ రచించినప్పటికీ, ఫకీర్ మోహన్ సేనాపతి నవల ఛ మన అఠ గుంట అన్యాపదేశ ప్రస్తావనల ద్వారా, వ్యంగ్యం ద్వారా ఆనాటి భారతీయ సమాజాన్ని, సంస్కృతిని, విశ్లేషణాపూరితంగా వర్ణిస్తుంది. అందువలన, ఫకీర్ మోహన్ సేనాపతి వాస్తవిక ధోరణిలో వ్రాసినప్పటికీ ఆయనను ఒక ఉత్తరాధునిక రచయితగా కూడా చూడవచ్చును.

శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి మాటల్లో చెప్పాలంటే “ఎమెనో కేవలం ఒక విశిష్ట శాస్త్రజ్ఞుడు మాత్రమే కాదు. ఒక మహామనీషి కూడానూ. ఆయన మంచితనం, ఏమాత్రమూ గర్వం లేని ప్రవర్తన, శాస్త్రీయ పరిశోధనలో ఆయన చూపించే ఏకాగ్రత, శ్రద్ధాసక్తులు ఆయన శిష్యులందర్నీ ఎంతగానో ప్రభావితంచేశాయి. ఆయన శిష్యులందరికీ ఆయన ఒక గొప్ప స్ఫూర్తీ, మార్గదర్శీ”.