క్రీస్తు పూర్వం కనీసం రెండువేల సంవత్సరాల క్రిందటనే తెలింగము మాట్లాడు భాషగా ఉండేది. భట్టిప్రోలు శాసన కాలానికి, అంటే క్రీపూ. 3వ శతాబ్దం నాటికి తెలింగమును అజంత భాషగా వ్రాతకు అనుకూలంగా చేసుకొనిరి. బ్రాహ్మీలిపి పోలిన మఱియొక లిపి యుండెనని కూడా బూలర్ అభిప్రాయపడెను. వ్రాత భాషగా రూపొందించుటకు చాలా ప్రయత్నము చేసినట్లు ప్రాచీన తెలుగు శాసనాలు సూచిస్తున్నవి.

ఇది యుగాది సమయము. వసంతఋతువుతో ప్రారంభమవుతుంది క్రొత్త సంవత్సరము. ఈ హేవిలంబినామ సంవత్సరమును కొన్ని వసంతతిలకములతో, ఆ లయ ఉండే పద్యములతో శుభాకాంక్షలతో ఆహ్వానిద్దామా?

ఒక్క పదేళ్ళ క్రితం వరకు సినిమా ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నకు దర్శక నిర్మతల నుండి ఒకే రకమైన జవాబు ఉండేది: కథ, సెంటిమెంట్, హాస్యం, ఏక్షన్‌తో పాటు యువతకు, మహిళలకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉండబోతున్నాయి మా చిత్రంలో, అని. ఈమధ్య కాలంలో ఆ మొత్తం చెబితే ఎగతాళి చేస్తారనో ఏమిటో, ఆ పైని పడికట్టు పదాలు అన్ని కలిపి ఎంటర్‌టైన్‌మెంట్ అన్న గంప గుత్త మాటతో సరిపుచ్చేస్తున్నారు.

ఆష్‌లీ, ధర్మారావుల మధ్య ఇక్కడ కనిపించే మరో పోలిక ఏమిటంటే, ఇద్దరికీ ‘అందరినీ సమానుల్ని’ చేసే పరిణామస్వభావం పట్ల సానుకూల అవగాహన లేదు. అంతవరకూ తను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న కొద్దిమంది మిత్రులతో తనదైన భావనాత్మక ప్రపంచంలో జీవించిన ఆష్‌లీ, యుద్ధం వల్ల తనతో ఎలాంటి సారూప్యత లేని మనుషుల మధ్య గడపవలసి వచ్చినందుకు బాధపడతాడు. ధర్మారావులోనూ అడుగడుగునా శిష్టత-సామాన్యతల వివేచన వ్యక్తమవుతూనే ఉంటుంది.

ఆ మధ్య టైటిల్సు ఆఖర్లో కొత్త కార్డ్ ఒకటి ప్రత్యక్షం అవడం మొదలు పెట్టింది – దర్శకత్వపు పర్యవేక్షణ అని. ఒక లఘు డైరెక్టరుగారి చేతిలో ప్రతిష్టాత్మక చిత్రం పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఒక గురు డైరెక్టరుగారు అధ్యక్ష పీఠం అధిష్టించి ఈ సత్తరకాయ గారిని సరిదిద్దుతూ ఉంటారు. దర్శకత్వమే అంటేనే పర్యవేక్షించి తప్పొప్పులు ఎత్తి చూపే పని ఐతే, మళ్ళీ ఈ తోక ఎందుకో, ‘ఆడ లేడీస్’ అన్నట్టు.

బండ నెత్తిమీద పడినంత వేగంతో నడుస్తుంది ‘బండపాటు’లో కథనం. చావు తరువాతి సంఘటనలన్నీ జోరుగా జరిగిపోతాయి. ఎవరి నాటకాలు వాళ్ళు ఆడుతూ లాభం పొందటానికి చేసే ప్రయత్నాలను చాసో తీవ్రంగా ఉద్విగ్నంగా అన్నిటినీమించి వ్యంగ్యంగా ధ్వనింపజేస్తారు. మనిషితనం నశించినవాళ్ళ ప్రవర్తన ఎంత హీనంగా ఉండగలదో మనం ఊహించలేనంత పదునైన వ్యంగ్యంతో వర్ణిస్తూ బాధాకరంగా నెమ్మదిగా ‘కఫన్‌’ను నడిపిస్తారు ప్రేమ్‌చంద్.

విశ్వనాథవారి వేయిపడగలు నవలను, మార్గరెట్ మిచల్ నవల గాన్ విత్ ద విండ్‌ రెండూ ఇంచుమించు ఏక కాలంలో వెలువడినవే కాని, రెండింటి భౌగోళిక తాత్విక నేపథ్యాలు వేరు. ఒకదానిది భారతీయ నేపథ్యం, ఇంకోదానిది అమెరికన్ నేపథ్యం. అలాంటిది, వాటి మధ్య పోలికలు ఒక ఆశ్చర్యమైతే, ఆ పోలికలలో కొన్ని తేడాలూ అంతే ఆశ్చర్యం.

గడచిన నెల వ్రాసిన వ్యాసములో ఉదాహరణముల ఉత్పత్తిని, వాటి నియమములను, విభక్తులను గుఱించిన విశేషములను, రగడల లక్షణములను చర్చించినాను. ప్రతి విభక్తికి నిదర్శనముగా కొన్ని ప్రసిద్ధమైన ఉదాహరణ కావ్యములనుండి వృత్తములను, కళికోత్కళికలను నిదర్శనములుగా చూపినాను. ఇప్పుడు నేను వ్రాసిన శారదోదాహరణతారావళి అనబడు ఒక ఉదాహరణకావ్యమును మీకు సమర్పిస్తున్నాను.

స్క్రిప్టు ఇంకా పూర్తిగా రాయబడలేదు. క్లయిమాక్సుని ఎలా ముగించాలో తెలియక సినేరిస్టులు (అంటే స్క్రీన్‌రైటర్లే. సినేరియోలు రాస్తారని అలా అనేవారు లెండి ఒకప్పుడు) తలలు పట్టుకున్నారు. అప్పటికే ముగ్గురి తలలు ఎగిరి పడ్డాయి కూడా. ఈ లోపల హీరోగారికి అసహనం పెరిగిపోతోంది.

తెలుగు సాహిత్యములోగల పలు ప్రత్యేకతలలో ఉదాహరణము మిక్కిలి ప్రసిద్ధి యైనది. ఉదాహరణము అనగా ప్రతియొక విభక్తితో మూడు చొప్పున పద్యములు వ్రాసి చివర అన్ని విభక్తులతో ఒక పద్యమును వ్రాయుట. అంకితాంకముతో మొత్తము ఇరువదియాఱు పద్యములతో వ్రాయబడిన ఇట్టిది ఒక లఘుకావ్యము లేక క్షుద్రకావ్యము. ఇది చతుర్విధ కవితలలో మధుర కవిత వర్గమునకు చెందినది.

చిత్రకవిత్వము యొక్కయు, ఆశుకవిత్వము యొక్కయు ప్రధానాశయము వినోదమే. చిత్రకవిత్వమును కవి ముఖ్యముగా తన పాండిత్యప్రకర్షను ప్రదర్శించుకొనుట కనేక నిర్బంధములకు లోనయి వ్రాయుట జరుగుచున్నది. ఇట్టి నిర్బంధములకు లోనయినను, చక్కని పద్యము నల్లిన కవి యొక్క మేధాశక్తి విస్మయావహముగా నుండుటయు, అట్టి మేధాశక్తికి పాఠకుడు అబ్బురమును, ఆనందమును పొందుటయు ఇట్టి కవిత్వము యొక్క ప్రధాన ప్రయోజనము.

డిలన్ పాటకుడా, కవా? 1996నుంచీ ప్రతి సంవత్సరం డిలన్‌ని నోబెల్ బహుమతికి నామినేట్ చెయ్యటం, దానితోపాటు ఈ ప్రశ్న ఉద్భవించటం ఆనవాయితీ అయ్యింది. డిలన్‌ని అడిగినప్పుడు ఏదయితే నేను పాడగలనో దానిని పాట అంటాను; ఏదయితే నేను పాడలేనో దానిని కవిత అంటాను, అన్నాడు.

తమిళములో పా అంటే పాట అని చెప్పవచ్చును. ప్రాచీన తమిళ ఛందస్సులో ప్రసిద్ధికెక్కిన ‘పా’ ఛందస్సులు – వెణ్బా, ఆశిరియప్పా, కలిప్పా, వాంజిప్పా, మరుట్పా.ఈ వ్యాసములో వెణ్బాగుఱించి మాత్రమే చర్చిస్తాను. వెణ్ అనగా తెలుపు అని, పా అనగా పాట అని అర్థము, కాబట్టి వెణ్బాను ధవళగీతి అని పిలువవచ్చును.

ఆంధ్ర మహాకవులు సంస్కృతం నుంచి తెలుగులోకి కావ్యాన్ని పరివర్తించేటప్పుడు భాషాంతరీకరణంలో వారు అనుసరించిన శాస్త్రీయమార్గాలేమిటి? వారు చేసిన ప్రాతిపదిక కృషిస్వరూపం ఏమిటి? అందుకు మార్గదర్శకసూత్రాలు ఏమున్నాయి? అని వివరించినవారు లేరు. తెలుగులో ఆ ప్రకారం తన అనువాదసరణిని సవిస్తరంగా పేర్కొన్న ఒకే ఒక్క మహాకవి శ్రీనాథుడని ప్రసిద్ధి.

సెయింట్ జార్జి కోటలో నున్న కళాశాలలో తెలుగు పండిత పదవి దొరకకముందు చిన్నయ కొన్నాళ్ళు సి. పి. బ్రౌన్ దగ్గర పనిచేశాడు. బ్రౌన్ పద్ధతులు చిన్నయకు నచ్చలేదో, చిన్నయ రచనా పద్ధతులు బ్రౌన్‌కి నచ్చలేదో, ఆ ఉద్యోగంలో చిన్నయ ఎక్కువ కాలం ఉండలేదు. అంతకు ముందు మిషనరీ స్కూలులో పని చేసినప్పటికీ, కోటలో వుద్యోగం దొరికిన తరువాతే చిన్నయకి కొంత స్థిరమైన, సుఖమైన జీవితం ఏర్పడింది.

ఆంధ్ర శబ్దం జాతివాచకంగా భాషావాచకంగా మనకు అర్వాచీనంగా సిద్ధిస్తే అంతకు ముందు మన భాషకు తెలుగు అనిగాని తెనుగు అనిగాని వ్యవహారంలో ఉండాలి. కాని ఈ శబ్దాల ప్రాచీనత మీద, వ్యుత్పత్తి మీద చాలా సందేహాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు తెలుగు ప్రాచీనమన్నారు. మరికొందరు తెనుగు ప్రాచీనమని వాదించారు.

Many native speakers of Telugu are hardly aware that words such as chirunāmā (చిరునామా), chukkāni (చుక్కాని), darjā (దర్జా), maidānam (మైదానం), rahadāri (రహదారి), rangu (రంగు) and salahā (సలహా) like more than a 1000 others, are of Turkish, Arabic and Persian origin; and that Telugu is made up of 65% Sanskrit words.

ప్రియుని తనకడకు రప్పించుకొనునది గాక, తానే ప్రియుని సంకేతస్థలమున కలసికొనునది రెండవ రకమైన అభిసారిక. గూఢముగా వెన్నెలరాత్రులలో నభిసరించు స్త్రీకి జ్యోత్స్నాభిసారిక యనియు, అట్లే చీకటిరాత్రులలో నభిసరించు స్త్రీకి తమోభిసారిక, లేక తమిస్రాభిసారిక యనియు పేర్లు.

తెలంగాణా పోరాటం, ప్రజల ఇక్కట్లు, తాను చదువుకొంటున్న సోవియట్ విప్లవ విజయాలూ, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త్రుత్వం సోసును బాగా కదలించి వేశాయి. మార్పు కోసం, ప్రజలపక్షాన నిలవడానికి తన్నుతాను సిద్ధం చేసుకొన్నారు.