పట్రాయని సంగీతరావు గారు ఈమాట పాఠకులకు సుపరిచితమే. 1930-40 ప్రాంతంలో, సాంస్కృతిక కేంద్రంగా విజయనగరం గురించిన ఆయన జ్ఞాపకాలను ఈ సంచికలో మీరు వింటారు.

అద్దేపల్లి రామమోహనరావు గారు జాషువా గారి గబ్బిలం కావ్యాన్ని వ్యాఖ్యానిస్తూ వీనులవిందుగా చదివి వినిపిస్తున్నారు. దీన్ని “ఈమాట” కు అందించిన శొంఠి రమణ గారికి, […]

ఇది నేను కొన్ని నెలలక్రింద ఈమాటలో ప్రచురించిన ‘వాణి నారాణి’ అను నాటికలో సందర్భానుసారముగా ఐదుపాటలను వివిధరాగములలో వ్రాసితిని. శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు ఆ ఐదుపాటలను పాడిరి. ఆపాటలతో గూడిన పినవీరనవృత్తాంతము నిక్కడ ప్రదర్శించుచున్నాను.

అజంతా (పెనుమర్తి విశ్వనాథశాస్త్రి) తన కవిత్వాన్ని ప్రచురించడానికి అంతగా ఇష్టపడేవారు కాదని అంటారు. అలాగే ఆయన పెద్దగా ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు, ప్రసంగాలు చేసినట్లు కనపడటంలేదు. ఆయన కవితలని రెండింటిని ఆయన గొంతులోనే వినిపిస్తాను.

వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు గొప్ప పండితుడు. ఆయన రచనలలో, ప్రభావతీ ప్రద్యుమ్నము (1962), మనుచరిత్ర (1968) కావ్యాలకు రాసిన మంచి వ్యాఖ్యలు చాలామందికి తెలిసి ఉంటాయి. ఆయన తన సాహితీ యాత్ర పై చేసిన ప్రసంగం ఈ సంచికలో విందాం.

ఇన్నేసి మతాలు, ఆచారాలూ , వాటితో పోరాడుతూ నిబ్బరంగా సాగుతూంటారు ఈ చిన్ని గుంపులోని మనుషులు. మత మౌఢ్యం పెద్ద పులి. వేటాడుతుంది వీరిని.

ఇది భాగవతుల త్రిపుర సుందరమ్మగారు (బీనాదేవి) రావిశాస్త్రిగారి కథలపైన 1997లో విజయవాడ కేంద్రంలో చేసిన ప్రసంగం. ఈ ప్రసంగ పాఠం తరువాత వార్త దినపత్రికలోను, పైన పేర్కొన్న సమగ్ర రచనల సంకలనం లోను ప్రచురితమైంది.

రేడియో ‘అక్కయ్య, అన్నయ్య’లుగా ప్రసిద్ధులైన న్యాయపతి కామేశ్వరి, రాఘవరావుల గురించి ఎటువంటి పరిచయం అవసరం లేదనుకుంటాను. ఈ సంచికలో ‘బాలానందం’ బృంద గేయాలుగా వచ్చిన కొన్ని రికార్డులను విందాం.

అప్పుడెపుడో చిన్నపుడు గుళ్ళో ఉన్నప్పుడు భోరున వర్షం కురవడం మొదలై అక్కడే కూచుండిపోతే ఆ చీకట్లో దీపపు వెలుగులో ఉన్నట్టుండి మెరుపు మెరిసి ఆ తెల్లటి వెలుతురు తెర వెనుక వెచ్చగా –

ఈ సంచికలో ప్రముఖ గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమం వినవచ్చు. ఈ కార్యక్రమం విజయవాడ స్టేషన్ నుండి 1979-1980 ప్రాంతంలో ప్రసారమయ్యిందని జ్ఞాపకం.

ఎందరో హేమాహేమీలు: మల్లిక్, ఓలేటి, ఎన్.సిహెచ్.వి. జగన్నాథాచార్యులు, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది సూరిబాబు, … పాల్గొన్న ఈ చక్కటి సంగీతనాటిక విజయవాడ స్టేషన్‌లో, 1970ల చివర్లోనో, 1980ల ప్రారంభంలోనో, ప్రసారితమైంది.

చిన్నయ సూరి బాలవ్యాకరణం పైన ఏ మాత్రం ఆసక్తి వున్న వారికైనా దువ్వూరి వెంకటరమణశాస్త్రిగారి పేరు తప్పకుండా తెలిసి వుంటుంది. ఆయన బాలవ్యాకరణానికి రమణీయం అన్న పేరుతో రాసిన వ్యాఖ్య బహు ప్రసిద్ధం. ఈ సంచికలో ఆ ప్రసంగం వినండి.

తెన్నేటి సూరిగారి చెంఘిజ్ ఖాన్ ఎంత ప్రాచుర్యం పొందిందో మాటల్లో చెప్పలేం. ఈ రచనని (సెప్టెంబరు 1998) రేడియో నాటకంగా శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు అనుసరించి ప్రసారం చేశారు. ఆ పుస్తకంలో వున్న వేగం, చదివేటప్పుడు కలిగే అనుభూతి ఈ నాటకం వినడంలో కూడా ఉన్నాయో లేదో మీరే చెప్పండి.

నటీమణి ఎస్. వరలక్ష్మితో శ్రీ ఈడుపుగంటి లక్ష్మణరావు చేసిన ముఖాముఖీ, ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రం సమర్పణ. ఇద్దరు ప్రసిద్ధులు పాల్గొన్న ఒక అపురూపమైన ముఖాముఖీ!

రచయిత బుచ్చిబాబు ప్రసిద్ధ నవల చివరకు మిగిలేది గురించి ఈమాట పాఠకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నవలను రేడియో కోసం పాలగుమ్మి పద్మరాజు 1960లలో నాటికగా మలిచారు. ఆ నాటికను మీకోసం ఈ సంచికలో పరుచూరి శ్రీనివాస్ సమర్పిస్తున్నారు.