ఈ మధ్య మరీ ‘తాతల కాలంనాటి పాతపాటలు’ వినిపిస్తున్నానని కొంతమంది వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారని, రేడియో ప్రసంగాలు ఏమయినా ఉన్నాయా అని నా టేపుల్లో వెతుకుతుంటే మో (వేగుంట మోహనప్రసాద్), సంజీవదేవ్‌, విజయవాడ రేడియో కేంద్రంలో మాట్లాడినవి దొరికాయి.

కళావర్ రింగ్ (1908-1964) అన్న పేరు నేను మొదటిసారి విన్నది 1981-82 ప్రాంతాల్లో. ఆవిడ అసలు పేరు సరిదె లక్ష్మీ నరసమ్మ. కళావర్ రింగ్ అన్న పేరు రావటానికి ఒక శృంగార పురుషుని చేతికున్న కళావర్ మార్కు ఉంగరం కావాలి అని మారాం చేస్తే అతడు ఆవిడను చేరదీసినట్లు, అప్పటి నుండి ఆ పేరు స్థిరపడిపోయినట్లు చెప్తారు.

గతంలో బి.ఎన్‌. రెడ్డి పైన వ్యాసం రాసినప్పుడే ఈ రేడియో ఇంటర్‌వ్యూని ప్రస్తావించినందువల్ల దానిని కూడా జత పరచుదామనుకున్నాను కానీ సమయానికి డిజిటైజ్ చేయడం సాధ్యపడలేదు. ఆ తర్వాత దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. అలా ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు, ఇక్కడ, మీరందరూ వినగలిగేట్లు!

ముందుగా ఒక సినిమా రికార్డు. ఇది అక్కినేని నాగేశ్వరరావు నటించిన శ్రీ సీతారామజననం (1944) అన్న సినిమాలోనిది. కోరస్‌లో ఆయన కూడా గొంతు కలుపుతారు. అక్కినేని అంతకు మూడేళ్ళ ముందు ధర్మపత్ని (1941) అన్న సినిమాలో ఒక చిన్న పాత్ర ధరించినా శ్రీ సీతారామజననం సినిమాతోనే అందరికీ పరిచయమయ్యారు.

ఈ సంచిక కోసం ఎప్పటిలాగా లలిత గీతాలు, సాహిత్య కార్యక్రమాలు, సంభాషణలు కాకుండా విజయవాడ రేడియో స్టేషన్ నుండి భక్తిరంజని కార్యక్రమంలో దశాబ్దాల పాటు వినబడిన కొన్ని కీర్తనలు, స్తోత్రాలు, అష్టకాలు లాంటివి వినిపిస్తున్నాను.

ఇది విశ్వనాథ రాసిన మొదటి నాటకం (1924). చాలా చక్కటి రచన! కీచకవధ కథని నాటక వస్తువుగా తీసుకుని చాలా గొప్పగా నిర్వహించారు విశ్వనాథ. నాలుగుసార్లు (ఇంకా ఎక్కువ?) ముద్రణలు పొందింది. ఈ నాటకాన్ని రేడియోలో ప్రసారం కోసమై ఉషశ్రీ కొంత కుదించారు.

Tandem Songs అంటే ఒకే పాటని -సాహిత్యంలో కొద్దిగా మార్పులుండవచ్చు- వేర్వేరు గాయనీ గాయకులు, అదే బాణీలోనో లేక వేరే బాణీలోనే పాడటం. తెలుగు సినిమా పాటల్లో కంటే లలిత సంగీతంలో ఇలాంటి పాటలు చాలా యెక్కువగా కనిపిస్తాయి. అలాంటి ఒక ఒక 5 లలితగీతాలు ఇక్కడ వినండి.

ఒక అరుదైన నాటకం అందిస్తున్నాను. ఈ నాటకంలో చేయి పెట్టినవారందరూ ప్రముఖులే! సావిత్రి, గుమ్మడి, అల్లు రామలింగయ్య వంటి గొప్ప నటులు పాత్రలు పోషించారు. పాకాల రాజమన్నార్ రచించిన ఈ నాటకానికి దాశరథి స్క్రిప్ట్ రైటర్‌ గాను, మల్లంపల్లి ఉమామహేశ్వరరావు అనౌన్సర్‌ గానూ పనిచేశారు.

ఇప్పుడు అసలు నాజర్ ఎవరంటే ఎంతమందికి తెలుస్తుందో! నాజర్ జీవిత చరిత్ర గురించి తెలుగు వికీపీడియాలో చాలా వివరాలతో వ్యాసముంది – చివరివరకు తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చాలా నియమబద్ధమైన జీవితం గడిపిన మనిషి ఆయన.

ACP శాస్త్రి గారిగా చిరపరిచితులైన అందుకూరి చిన్నపొన్నయ్య శాస్త్రిగారు​ రేడియో నాటక రచయిత. వసుచరిత్ర లోని సంగీతశాస్త్రీయత గురించి న వారి రేడియో ప్రసంగమును ఈమాట పాఠకులకై వారి అనుమతితో బుసిరాజు లక్ష్మీదేవి దేశాయ్ సమర్పిస్తున్నారు

గాయని జిక్కి గురించి ఎటువంటి పరిచయం అవసరం లేదు. ఈ సంచికలో జిక్కి పాడిన, అంత తేలికగా దొరకని, మూడు పాటలు: మువ్వలు పలికెనురా, మబ్బుల్లో జాబిల్లి, కుందరదనా వినవే రామకథ – విందాం.

పిచ్చయ్య శాస్త్రిగారు, గుర్రం జాషువాగారు ఇద్దరూ వినుకొండలో స్నేహితులు, కలిసి చదువుకున్నారు. ఇద్దరూ కలసి జంట కవులుగా రచనలు చేయాలనుకున్నారని అయితే వీళ్లిద్దరి పేర్లు కలవక విరమించుకొన్నారనే కథ ఒకటి ఉంది.

ఈ అరుదైన యక్షగానం బాలాంత్రపు రజనీకాంతరావు గారు సంగీతం కట్టి 1999 వేసవిలో విజయవాడ రేడియో కేంద్రం ద్వారా ప్రసారం చేసినది.

20వ శతాబ్దపు తెలుగు సాహిత్య, సాంస్కృతిక చరిత్రతో యేమాత్రం పరిచయం వున్నా అబ్బూరి రామకృష్ణరావుగారి పేరు తెలియకుండా వుండదు. శ్రీశ్రీ ఆయన్ని ‘అబ్బూరి చలివేంద్రం’ అని ప్రశంసించేవాడు.

శేషయ్య శాస్త్రిగారు కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు. రాష్ట్ర ప్రభుత్వ హంస కళారత్న పురస్కారం, సంగీత కళా తపస్వి, గాన కళానిధి వంటి సన్మానాలను అందుకున్నారు. ఆయన హైదరాబాద్ శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు.

ఈ సంస్కృత నాటకం గురించి గతంలో ఒకసారి ప్రస్తావించాను. ఈ మధ్యనే ఎస్. వి. భుజంగరాయ శర్మగారి రేడియో ప్రసంగం ఒకటి దొరికింది, అదికూడా ఈ కాలిదాస నాటకం పైన చేసినది. ఆయన ప్రసంగాన్ని, దానికి అనుబంధంగా ఈ నాటకాన్ని ఇక్కడ జత చేస్తున్నాను.