ఈమాట

Expand to right
Expand to left

సూచిక: కీలకపదం - "9వ ఆటా మహాసభల వ్యాసాల పోటీ"

ఈ క్రింది రచన(లు) "9వ ఆటా మహాసభల వ్యాసాల పోటీ" ని కీలక పదం గా పేర్కొన్నాయి.

నేటి సినిమాలలో వికృత పోకడలు - విపరీత ధోరణులు

ఈ మధ్య వస్తున్న సినిమాలను చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తున్నా, విడుదలై వస్తున్న సినిమాల సరళి మారలేదు. అటు దర్శక నిర్మాతల, ఇటు నటీనటుల ధోరణిలో కూడా రవ్వంత మంచి మార్పు రాకపోవడం చాలా దురదృష్టకరం, విచారించదగ్గ విషయం కూడా. 50 సంవత్సరాల క్రితం ఒక సినిమా నిర్మించడానికి సంవత్సరాల వ్యవధి చాలేది కాదు. అటువంటిది, ఈనాడు రెండు, మూడు నెలల్లో తయారై సినిమాలు ప్రేక్షకుల్ని హింసిస్తున్నాయి. రాశి పెరిగింది, వాసి తరిగింది.

పూర్తిగా »

తెలుగు గ్రామాలు - ఒక అవలోకనం

ఈనాటి పరుగు పందెపు ప్రపంచంలో వివిధ రకాలైన కాలుష్యాలతో, అసభ్యకర నాగరికతతో, స్వార్థరాజకీయాలతో పెద్దా - చిన్నా అనే తేడా లేక నైతిక విలువలు పతనమయ్యాయి. తల్లిదండ్రులు, గురువులపైన వినయ విధేయతలు, భక్తిశ్రద్ధలు మృగ్యమైనాయి. సుఖం మరిగి ఆర్థిక జీవన వ్యాపారంలో ధనార్జనే ధ్యేయంగా సొంత లాభంకోసం మానవుడు వెంపర్లాడుతున్నాడు. ఈ కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ యుగంలో మనుషులు యంత్రాల్లాగా తయారై, మనసులు మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘సమకాలీన తెలుగు గ్రామాలను’’ సింహావలోకనం చేస్తే ….

పూర్తిగా »

ప్రస్తుత తెలుగు కథ - ఒక జీవన కఠోర వాస్తవం

పదిహేను వసంతాల తెలుగు కథను గురించి ప్రస్తావించుకోవల్సి వచ్చినప్పుడు గత శతాబ్దాపు చివరి దశకం ప్రారంభంలో మన జీవితాల్లోకి ఒక ఉప్పెనలా తోసుకొచ్చిన ప్రభుత్వ ఆర్థిక విధానాలలోని మార్పు …. పందొమ్మిది వందల తొంభయి అయిదులో వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పడడం, పాలకులు జాతిభద్రతను సైతం మరిచిపోయి బహుళజాతి కంపెనీలను ప్రేమించడం …. రాష్ట్ర ప్రభుత్వాలు తమంతట తాము విదేశీ సంస్థలతో నేరుగా చేసుకుంటూన్న ఒప్పందాలకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు లాంఛన ప్రాయమవడం …. దేశ ఆర్థిక భద్రతను అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు నియంత్రించడం …. ఒక దానికకటి అనుబంధంగా జరిగిపోయిన గాథ పరిణామాలు మన వ్యక్తిగత జీవితాలను, సమాజాల్నీ కూడా అతలాకుతలం చేసిన క్రమంలో ఆ మార్పులన్నీ కూడా కథల్లో ప్రతిబించిస్తూ వచ్చాయి…

పూర్తిగా »

నిర్ణేతల వ్యాఖ్య: వ్యాసాలు, నాటకాలు

1990 తర్వాత తెలుగు సాహిత్యధోరణులు వికేంద్రీకృతమయ్యాయి. దానితో చాల ‘మంచి’ రచనలు సైతం తెలియకుండ పోయాయి. అలాంటి వాటిని నేను ఈ వ్యాసాల ద్వార గమనించగలిగాను. అట్లే సినిమాలకు సంబంధించి, గ్రామపునర్నిర్మాణానికి సంబంధించిన ఎన్నెన్నో విషయాలు తెలుసుకొనే అవకాశం నాకు కలిగింది.

పూర్తిగా »

ఆంధ్రప్రదేశ్ సంగీత, రంగస్థల కళారంగం:ఒక పర్యావలోకనం

భారతదేశం సకల కళలకు కాణాచి, అందులో ఆంధ్రదేశం ఎన్నో కళలకు జన్మస్థానమై విరాజిల్లుచున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సంగీత రంగస్థల కళారంగాన్ని నాటినుంచి నేటి వరకు పర్యావలోకనం చేయుట ప్రస్తుత వ్యాస ఉద్దేశము.

పూర్తిగా »

తెలుగు కవిత - ప్రస్తుత పరిస్థితి

ఇరవయ్యవ శతాబ్ది మధ్య భాగంలో తెలుగు సాహిత్యంలో విప్లవాత్మకమైన మార్పులు అనేకం చోటుచేసుకున్నాయి. ఒకవైపు పాండిత్య ప్రదర్శనే కవిత్వమనే అపోహతో సుదీర్థ సంస్కృత సమాసాలతో పొంతనలేని అలంకారాలతో, భయం కొలిపే శబ్ద విన్యాసంతో కొందరు కావ్యాలు వ్రాస్తూ ఉండగా, మరోవైపు జాషువా, కరుణశ్రీ, దువ్వూరి, రాయప్రోలు వంటి పండిత కవులే క్రత్త పుంతలు త్రొక్కి సామాన్య విద్యావంతులను సైతం ఆకట్టుకొనేలాగా ఖండకావ్యాలూ, లఘుకావ్యాలూ సరళమైన భాషలో వ్రాయసాగారు.

పూర్తిగా »

1991 - 2005 తెలుగు నవల - విస్తరించిన వివిధ కోణాలు

తెలుగు నవల సంఘ సంస్కరణోద్యమానికి చేదోడు వాదోడుగా నిలిచింది. ఆంధ్రుల చారిత్రక వైభవాన్ని చాటి చెప్పింది. జాతీయ ఉద్యమానికి ఊపిరులూదింది. మనిషి మనోవల్మీకంలో సంచరించే సరీసృపాల విన్యాసాల్ని, వాటి హేతువుల్ని వెదికింది. పోరాటాల్లో ‘మృత్యుం జయులై’న ‘‘ప్రజల మనుషుల్ని’’ వారి వీరోచిత గాథల్ని గానం చేసింది. ‘‘చెలియలి కట్టల్ని’’ దాటి ‘స్వేచ్ఛ’గా ‘మైదానాల్లో’ సంచరించింది. మధ్య తరగతి బుద్ధి జీవులకు ‘చదువు’ నేర్పించి ‘మంచీ - చెడులను’ విడమరిచింది. ‘అల్పజీవి’కి ఆలంబనగా నిలబడింది. ‘అంధకారంలో’ ఉన్న ‘మట్టి మనిషి’ని గురించి ఆరా తీసింది.

పూర్తిగా »