ఈమాట

Expand to right
Expand to left

సూచిక: కీలకపదం - "కబురు"

ఈ క్రింది రచన(లు) "కబురు" ని కీలక పదం గా పేర్కొన్నాయి.

నేటి సినిమాలలో వికృత పోకడలు - విపరీత ధోరణులు

ఈ మధ్య వస్తున్న సినిమాలను చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తున్నా, విడుదలై వస్తున్న సినిమాల సరళి మారలేదు. అటు దర్శక నిర్మాతల, ఇటు నటీనటుల ధోరణిలో కూడా రవ్వంత మంచి మార్పు రాకపోవడం చాలా దురదృష్టకరం, విచారించదగ్గ విషయం కూడా. 50 సంవత్సరాల క్రితం ఒక సినిమా నిర్మించడానికి సంవత్సరాల వ్యవధి చాలేది కాదు. అటువంటిది, ఈనాడు రెండు, మూడు నెలల్లో తయారై సినిమాలు ప్రేక్షకుల్ని హింసిస్తున్నాయి. రాశి పెరిగింది, వాసి తరిగింది.

పూర్తిగా »

ప్రవాసాంధ్ర రచయిత్రుల సొంత గొంతుక

ప్రవాసాంధ్ర సాహిత్యం
ప్రవాసంలో వున్నవారు ఏం రాసినా ప్రవాస సాహిత్యమవుతుందా లేక ప్రవాసజీవితం గురించి రాసిందే ప్రవాసాంధ్ర సాహిత్యమవుతుందా అన్న విషయం మీద గత అయిదారేళ్ళుగా చర్చ జరుగుతోంది. అమెరికాలో వుంటూ ఆముదాల వలసలో గడిపిన జీవితం గురించిన జ్ఞాపకాలు రాస్తే అది ప్రవాసాంధ్ర సాహిత్యం కాదని, అమెరికా జీవితం గురించి రాసిన సాహిత్యమే ప్రవాసాంధ్ర సాహిత్యంగా పరిగణించాలని కొందరి అబిప్రాయం. అయితే ప్రవాసంలో వుండటం వల్లే ఆ నోస్టాల్జియా బైటకు వస్తోంది కాబట్టి పరోక్షంగా అది ప్రవాసాంధ్రసాహిత్యంలో […]

పూర్తిగా »

తెలుగు డయాస్పోరా: సాహిత్యం, సంస్కృతి

మనకు పరాయీ అనిపించే పరిస్థితులూ, మనది కాని సంస్కృతి, మనవి కాని భాషల మధ్య - మనకెంత మాత్రమూ తెలియని లోకంలో మన వునికి ఏమిటి? దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
-ఇవి ఇప్పుడు ప్రవాసాంధ్రసాహిత్యం ముందు వున్న ప్రశ్నలు. అసలు ప్రవాసాంధ్ర సాహిత్యం అంటూ వుందా? వుంటే, దానికి కొన్ని సాంస్కృతిక లక్షణాలు వున్నాయా అన్న మౌలికమైన ప్రశ్న నుంచి ఈ అన్వేషణ మొదలు కావాలి.

పూర్తిగా »

అలుసవుతోన్న అమ్మ భాష

ప్రస్తుతం తెలుగుభాషను ప్రభావితం చేస్తున్న కొన్ని అంశాలనూ, అవి మన భాషపై ఆదరణ తగ్గడానికి ఏ రకంగా కారణమవుతున్నాయన్న వివరాలనూ ఇక్కడ చర్చిస్తాను. దానితోపాటు నాకు తోచిన కొన్ని పరిష్కార మార్గాలను కూడా సూచిస్తాను.

పూర్తిగా »

తెలుగు గ్రామాలు - ఒక అవలోకనం

ఈనాటి పరుగు పందెపు ప్రపంచంలో వివిధ రకాలైన కాలుష్యాలతో, అసభ్యకర నాగరికతతో, స్వార్థరాజకీయాలతో పెద్దా - చిన్నా అనే తేడా లేక నైతిక విలువలు పతనమయ్యాయి. తల్లిదండ్రులు, గురువులపైన వినయ విధేయతలు, భక్తిశ్రద్ధలు మృగ్యమైనాయి. సుఖం మరిగి ఆర్థిక జీవన వ్యాపారంలో ధనార్జనే ధ్యేయంగా సొంత లాభంకోసం మానవుడు వెంపర్లాడుతున్నాడు. ఈ కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ యుగంలో మనుషులు యంత్రాల్లాగా తయారై, మనసులు మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘సమకాలీన తెలుగు గ్రామాలను’’ సింహావలోకనం చేస్తే ….

పూర్తిగా »

ప్రస్తుత తెలుగు కథ - ఒక జీవన కఠోర వాస్తవం

పదిహేను వసంతాల తెలుగు కథను గురించి ప్రస్తావించుకోవల్సి వచ్చినప్పుడు గత శతాబ్దాపు చివరి దశకం ప్రారంభంలో మన జీవితాల్లోకి ఒక ఉప్పెనలా తోసుకొచ్చిన ప్రభుత్వ ఆర్థిక విధానాలలోని మార్పు …. పందొమ్మిది వందల తొంభయి అయిదులో వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పడడం, పాలకులు జాతిభద్రతను సైతం మరిచిపోయి బహుళజాతి కంపెనీలను ప్రేమించడం …. రాష్ట్ర ప్రభుత్వాలు తమంతట తాము విదేశీ సంస్థలతో నేరుగా చేసుకుంటూన్న ఒప్పందాలకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు లాంఛన ప్రాయమవడం …. దేశ ఆర్థిక భద్రతను అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు నియంత్రించడం …. ఒక దానికకటి అనుబంధంగా జరిగిపోయిన గాథ పరిణామాలు మన వ్యక్తిగత జీవితాలను, సమాజాల్నీ కూడా అతలాకుతలం చేసిన క్రమంలో ఆ మార్పులన్నీ కూడా కథల్లో ప్రతిబించిస్తూ వచ్చాయి…

పూర్తిగా »

జిగిరీ - 6వ భాగం

ఇమామ్‌ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. ఆలోచనల్లో పడి ఎప్పుడు పొద్దు గూకిందో తెలియలేదు. మసక మసకగా చీకట్లు పరుచుకుంటున్నాయి. ఊరు ఇంకా చాలా దూరంగా ఉంది. వెనక్కి తిరిగి చూశాడు. షాదుల్‌ గుర్రు గుర్రుమని వెంబడిస్తున్నాడు.
‘నీకు చేస్తున్న అన్యాయానికి నన్ను చంపేయకుండా ఎందుకురా …. గుడ్డిగా నమ్ముతున్నావు’ అనుకున్నాడు ఇమామ్‌ షాదుల్‌ను చూస్తూ.
ఇంటికి వెళ్ళాక తను చెప్పిన ఉపాయం పారుతుందా అన్న ఆలోచన ఒకవైపు …. దినదిన గండంగా షాదుల్‌ను ఎన్ని రోజులు ఇలా తప్పించగలను అనే ఆలోచన ఒకవైపు పట్టి కుదిపేస్తుంటే ఇమామ్‌ నడక వేగం తగ్గింది.

పూర్తిగా »

జిగిరీ - 5వ భాగం

అట్లా సారంపల్లిలో దిగినప్పుడు మండలానికి నడిచిపోయి ఎస్సైని కలిసిండు చాంద్‌. ఎస్సై ‘ఆడుక పోండ్రిరా’ అన్నాడు. ఎంత ధర్మాత్ముడు అని చాంద్‌ అనుకున్నాడు.
ఏదో కేసు మీద సారంపల్లి వచ్చిండు ఎస్సై. బజార్లో ఆడుతున్న తండ్రి కొడుకులను చూసి బూతులందుకున్నాడు.
‘‘దొరా …. మొన్న మా కొడుకు కలిసిండు గదా …. మీరే ఆడుకొమ్మంటిరి’’ ఇమామ్‌ అన్నాడు.
‘‘అరేయ్‌ …. స్టేషన్‌కు రాండ్రి మీ సంగతి చెప్పత’’ ఎస్సై అన్నాడు.

పూర్తిగా »

జిగిరీ - 4వ భాగం

‘అమ్మీ …. ఇయ్యాల్లనన్నా పీడ వదిలిపోతదంటవా ….’ చాంద్‌ అడిగాడు.
‘వదిలి పోతదిరా …. పొగాకు మందు గట్టిది. ఎనుకట మా మామ పెట్టిండు’ బీబమ్మ అన్నది.
‘దేనికి ….? ఎలుగుకా ….’’ అడిగిండు చాంద్‌.

పూర్తిగా »

జిగిరీ - 3వ భాగం

‘అబ్బా … అరే అబ్బా …’ చాంద్‌ మాటలతో ఉల్కిపడి తేరుకున్నాడు ఇమామ్‌. మంచంలోంచి లేచి కొడుకు వైపు చూసిండు. నిలువెత్తు గోతిలోంచి బయటకు వచ్చిండు చాంద్‌. వచ్చి తండ్రిని మరోసారి పిలిచిండు చాంద్‌.
ఇమామ్‌ బదులు పలుకలేదు. లేచి కూర్చున్నాడు. బీబమ్మ కోసం చూశాడు. బీబమ్మ వాకిట్లో కొంగు పరుచుకుని పడుకుంది. నిద్రపోతున్నట్టు గుర్రు వినిపిస్తుంది. ఇమామ్‌కు కోపం వచ్చింది. కోపంతో బాధ కూడా కలిగింది.

పూర్తిగా »

« పాత సంచికలలో ·