దారి
మనసు
ఇన్నాళ్ళూ
నాకో మనసుందనే సంగతే తెలీని మనసుమనసివ్వని మనసు
నిష్పేచీగా నిష్పూచీగా
నిశ్చింత మనసుమనసుచ్చుకోని మనసు
నిష్పందనగా నిశ్చలనంగా
నిస్త్రంత్రి మనసువజ్రపుముక్కలా గాజుపెంకులా
పాలరాతిబొమ్మలా
నిరీంద్రియ మనసుమనసు
గింజ లోంచి పసిమొలక తొంగిచూసినట్లు
మనసలికిడిఈ వెలుతురు నిన్నటి వెలుతురు కాదు
ఇంతకు ముందెన్నడూ చూడని ఏదో వింత కాంతి
ఈ గాలి నిన్నటి గాలి కాదు
ఇంతకు ముందెన్నడూ తాకని ఏదో వింత స్పర్శఅందుకే
మనసులో తపన తనువులో తపన నాలోనూ తపన
మనసులో సెగ తనువులో సెగ నాలోనూ సెగ
మనసులో వేదన తనువులో వేదన నాలోనూ వేదన
మనసులో అశాంతి తనువులో అశాంతి నాలోను అశాంతిఈ బాధ తియ్యగా ఈ తీపి బాధగా
ఈ తీపి చేదుగా ఈ చేదు తీపిగా
ఈ బాధ హాయిగా ఈ హాయి బాధగామనసైన మనసులో మనిషినై
మనసులో మనసైన మనిషినై
మనసుదారి మనిషిదారి కాదంటే
మరి నాదారి గోదారేనేమో