నేతల తలకోతలు: నాయకులు బలవంతంగా వారి ఇష్టానికి వ్యతిరేకంగా చంపబడ్డారనేది నిజం కాదు. అలా అంటున్నారూ అంటే మన రాజ్యాంగపు చట్టాలను సరిగ్గా అర్థం చేసుకోలేదన్నమాటే. నాయకులను ప్రజలతో నిజంగా కలిపే బంధం మన చట్టాల నిజమైన అర్థం, ఆశయం. నేతల తలలే తెగిపడతాయి ఎందుకూ అంటే తెగిపడడానికి సిద్ధపడని తల ఒక సమాజానికి పెద్దతల కాలేదు.

పోతూ వస్తూ దాటేసుకుంటూనే ఉంటాం. కానీ ఇంతకాలమైనా పరిచయం కాకుండా ఎందుకు ఉండిపోయింది? మనతో ప్రత్యేకించి పని పడకపోతే, ఉద్యోగరీత్యా సంభాషించుకోవాల్సిన అవసరం రాకపోతే ఎలా పరిచయం అవుతుంది? పనిగట్టుకొని పరిచయం చేసుకోవడంలో నాకు ఉత్సాహం లేదు. జరిగిపోవాలంతే. మన చుట్టూనే జీవితాలు ప్రవహిస్తూవుంటాయి. మనం వాటిని ఖండించుకుంటూనో, ఒరుసుకుంటూనో పోము. అసలు ఆ ప్రవాహానికీ మనకూ నిమిత్తమే లేదు. ఇదెంత శూన్యం?

ఇందాకా అనుకున్నాం కదా పిన్నీసు అని; చెప్పులు, పిన్నీసు రెండూ జంట కవులు. ఆ రోజుల్లో పిన్నీసుల హారం లేని ఆడ మెడ ఉండేది కాదు. పిన్నీసుకు జాత్యంతరం అంటదు. హిందూ, ముస్లిమ్, కిరస్తానీ అందరి మెడల గొలుసుల్లో పిన్నీసులు తళుకుమనేవి. అంగళ్ళల్లో పిన్నీసులు కొనడం డబ్బు దండగ, రోడ్ల మీద మొలతాడు దారాలు అమ్ముకునేవారి దగ్గర పిన్నీసు ప్యాకెట్లు కాస్త అగ్గువ. చొక్కాకు గుండీలు లేవా పిన్నీసు ఉందిగా!

“నేనెందుకు మరొకరి దగ్గర సాయం అడగాలి? ఇది నా బాధ్యత కదా? చెట్టుకు మధ్య భాగమే బలం. గట్టిబడి ఉక్కులా ఉంటుంది. ఆ చెట్టులో మొట్టమొదటి భాగమూ అదే. అయితే చెట్టుకి కావలసిన ఆహారాన్ని సరఫరా చెయ్యడం ఆ భాగంవల్ల కాదు. చెట్టుయొక్క తాట భాగమే ఆహారాన్నీ నీటినీ సరఫరా చేస్తుంది. ఆ భాగం లేతది, వయసులో చిన్నది. మనుషులూ అంతే. పెద్దలు కుటుంబానికి బలం. కొత్తతరం వాళ్ళే సంపాదనలవీ చూసుకోవాలి.”

చీకటి చీర
కొండచరియ అంచు
రాలుటాకులు కలంకారీ అద్దకాలు
కదిలే నీడలు ఎగిరేపైట
ఊగే ఊడలు చెరిగే కుచ్చిళ్ళు
లోయల ఒడి నిండుగ వనాలు జీవచరాలు

నిజానికి మనుగడలో ఉండే చిన్న పత్రికలు ఈనాడూ ఆనాడూ ఏ నిజాల కోసం, సత్యాలకోసం అచ్చు కాబడవు, పెద్ద పత్రికలూ అంతేననుకోండి! వాటి గురి పెద్ద ప్రయోజనాలు నెరవేర్చుకోడంలో ఉంటుంది. చిన్న పత్రికలు కేవలం నాలుగు డబ్బులు గిట్టుబాటు కావడం కోసం మాత్రమే అచ్చవుతాయి. ఈ చిన్న పత్రికలవారికి అతి ముఖ్యంగా కావలసినవి అడ్వర్‌టైజ్‌మెంట్లు. ఇలాంటి పత్రికలు నిజంగా పత్రికల్లా ఉండవు.

మహాకవులు ఇలాంటి కథలు ఎందుకు వ్రాస్తారో నాకు అర్థం కాదు. శివపూజ చేస్తే పాపాలు పోతాయి అని చెప్పడానికి ఇంత మహా పాపాల్ని చేయించాల్నా? కనీసం భక్తి అనేదే లేక, అనాలోచితంగా జరిగిపోయిన పనులే పూజలుగా భావింపబడి–వినటానిక్కూడా అసహ్యం అనిపించే తనయాగమనం లాంటి భ్రష్టకార్యాలు కూడా మానవుడి ప్రయత్నం గానీ, కనీసం పశ్చాత్తాపం గానీ లేకుండా మాసిపోయేటట్లయితే–ఇక భక్తి దేనికి, సత్కర్మాచరణ ఎందుకు?

అల్లదివో సూశారా! అనపడతాంది కాలవ, ఆయ్! అది మాసేలకి నీల్ల కోసం తెల్లోళ్ళు తొవ్వించినదండి. ఇది పంట కాలవండి. పెద్ద కాలవమీద మాకోసమే లాకోటి కట్టిచ్చారండి. రెండు పంటలకి నీటికి కొఱవ లేదండి. ఆయ్! ఇక్కడ మొదలండి, ఇదిగిదిగో! ఇటు సూడండి. అల్లదిగో సింతసెట్టండి, అది దచ్చిన సరద్దండి, అల్లాపడతన్నాది కొబ్బరి సెట్లొరస, అదండి పచ్చిమ సరద్దు, ఆయ్! ఇటు సూడండి తాడిసెట్ల గుంపు, అదండి ఉత్తర సరద్దు.

కౌగిలించుకు
బతుకునిచ్చే నవ్వూ, మాటా,
ప్రతి కొత్త కోరికా
నువ్వేనని
నీ తొలి అడుగుకై
ప్రతి పడిగాపూ నాదే

“మొదటిసారి సుజాత ఇచ్చిన పాయసం వల్ల నా ప్రాణలు నిలిచి గౌతముడినైన నేను జ్ఞానోదయంతో ధర్మాన్ని కనుక్కోగలిగాను. ఆ రోజు సుజాత పాయసం ఇచ్చి ఉండకపోతే తథాగతుడే లేడు. బుద్ధత్వం పొందాక ప్రారంభించిన ధర్మ చక్ర పరివర్తనం ఈ రోజుకి దాదాపు పూర్తైంది. సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు; ప్రతీ ప్రాణీ అంతమై తీరుతుంది. ఆ క్రమంలోనే ఈ పరివర్తనం అనేది ఎప్పుడో ఒకసారి అంతమవ్వవల్సిందే కదా?”

కానీ ఈ పాటైనా, తక్కిన కృష్ణమ్మా గోపాలబాలా కృష్ణమ్మా హరి హరి గోవింద బాలా కృష్ణమ్మా, ఓ యశోద ఏమి చేయుదమే, నందగిరి బంగారుమామ చంద్రగిరి చీరలంపేవా, పాటల కైనా సాహిత్యాన్ని ఇవ్వటం కష్టమైన పని. సాధ్యంకాని పని అని చెప్పాలేమో! ఈ ఆడియోలో పాడిన పాఠం మీకు పుస్తకాలలో కనపడే పాఠాలకి భిన్నంగా ఉంటే ఆశ్చర్యం లేదు.

క్రితం సంచికలోని గడినుడి-28కి మొదటి ఆరు రోజుల్లోనే ఆరుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు: 1. శైలజ/ఆగడి ప్రతిభ, 2. వైదేహి అక్కిపెద్ది, 3. అనూరాధా శాయి జొన్నలగడ్డ, 4. బండారు పద్మ, 5. ప్రణీత, 6. కోడిహళ్లి మురళీమోహన్. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-29 సమాధానాలు, వివరణ.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.